విజయ్ దేవరకొండ వాళ్ళ భరతం పట్టాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-10-02 11:02:17

విజయ్ దేవరకొండ వాళ్ళ భరతం పట్టాడు

ఇంతకు ముందు సినిమా రిలీస్ అయ్యాక, థియేటర్ లో షూట్ చేసి పైరసీ గా చేసేవారు, మన దర్శకనిర్మాతలు దాని మీద పోరాటం చేసేవారు.. ఇప్పుడు ఆ పైరసీ అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చింది, సినిమా రిలీస్ కాకముందే నెట్ లోకి వచ్చేస్తుంది, అది కూడా ఆ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళ ద్వారానే , పైరసీ వల్లే ఇబ్బందులకు గురి అవుతున్న నిర్మాతలు, ఈ లీకులు తో సతమతమవుతున్నారు.. మొన్న ఆ మధ్య గీత గోవిందం లోని కొన్ని సీన్లు, అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కొంత లీక్ అయిన విషయం తెలిసిందే.

గీత గోవిందం లో కొన్ని సీన్లే అయితే విజయ్ దేవరకొండ మరో సినిమా అయిన టాక్సీవాలా పూర్తి సినిమా ఇంటర్నెట్ లోకి వచ్చేసింది, దీనితో చిత్ర నిర్మాతలు షాక్ కి గురయ్యారు.. ఆ వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెల్ల కమల్ - భార్గవ్ కుమార్ - బీఆర్ పేర్లతో ఉన్న జీ–మెయిల్ ఐడీలు కలిగిన డ్రైవ్ అకౌంట్లు ద్వారా సినిమా షేర్ అవుతుంది అని కనిపెట్టి ఆపవలసింది గా పోలీసుల్ని కోరారు..ఈ క్రమంలోనే ఆ లీకు చేసిన వ్యక్తుల్ని అదుపులోకి తీస్కునట్టు తెలుస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో వారు దొరికారని - దేవరపల్లిలో టాక్సీవాలా నిర్మాతలు - పోలీసులు ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ లీకు లకి సంబందించిన వివరాల్ని వెల్లడిస్తారని తెలిసింది.. ఇది ఇలా ఉండగా గీతగోవిందం సినిమా కన్నా ముందుగానే విజయ్ దేవరకొండ టాక్సీవాలా షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు, లెక్క ప్రకారం ఈ సినిమానే ముందు విడుదల అవ్వాల్సింది కూడా కానీ,వర్క్ ఔట్ పుట్ లో లోపాల వల్ల, మరో సంస్థతో తో చేయిస్తున్నారు ఈ కారణంగా లేటయింది. దీంతో గీత గోవిందం ముందుగా విడుదలైంది. లీక్ అయినది రా ఫుటేజ్ కాబట్టి దాంట్లో సిజి , డబ్బింగ్, ఆడియో ఉండవు కాబట్టి ప్రొడ్యూసర్లు ఊపిరి పీల్చుకోవచ్చు..మూలిగే నక్క పై తటికాయ పడినట్టు అసలే లేట్, పైగా ఈ లీక్ లు... ఈ ట్రాఫిక్ సమస్యలు అన్ని దాటుకుని టాక్సీవాలా ఎప్పుడు ట్రాక్ ఎక్కుతాడో చూడాలి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.