మ‌హేష్‌తో పోటీ ప‌డుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 17:48:56

మ‌హేష్‌తో పోటీ ప‌డుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

"భరత్ అనే నేను" సినిమాతో ఇటివలే ముఖ్యమంత్రి పాత్రలో అదరగొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇప్పుడు మరో యంగ్ హీరో మహేష్ బాబు లాగ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అలాగే ఈ హీరో తమిళ్ తెలుగు తో పాటు "నోటా" అనే సినిమాలో నటిస్తున్నాడు.."ఇంకొక్కడు" ఫేం అయిన ఆనంద్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు అట. పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా బాగుంటుంది అట.

మరి "అర్జున్ రెడ్డి" తో ఆరోగేంట్ రోల్ లో ఊగిపోయిన విజయ్ దేవరకొండ ఈ ముఖ్యమంత్రి పాత్రలో ఎలా ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అందులో ఒకటి "టాక్సీ వాలా" అనే థ్రిల్లర్ కాగ మరొకటి "గీత గోవిందం" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ రెండు సినిమాలు ఆగష్టు లో రిలీజ్ కానున్నాయి.

షేర్ :