కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోతాను అంటున్న విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay
Updated:  2018-08-24 03:43:57

కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోతాను అంటున్న విజయ్ దేవరకొండ

"గీత గోవిందం" లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ ఒక హాలిడే ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాడు అంట. ఈ మధ్యలో ఫుల్ బిజీ అయిన ఈ యాక్టర్ తనకి కొన్ని రోజుల పాటు బ్రేక్ అవసరం అనుకుంటున్నాడు అంట.
 
"నేను ఒక పది రోజులు యూరోప్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పది రోజులు నా ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాను. ఈ టైం లో కొంచెం రిలాక్స్ అవుతూ వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు విజయ్. అలాగే ఒకే సారి ఇన్ని మూవీస్ లో నటించడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అని, వీటితో పాటు సక్సెస్ పార్టీస్ వల్ల కూడా అస్సలు బ్రేక్ దొరకట్లేదు అంట, అందుకే సడన్ గా ఈ యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసాడు అంట విజయ్ దేవరకొండ.
 
ఇదిలా ఉంటే "గీత గోవిందం" సినిమా యాబై కోట్లకి పైగా వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళి ఈ యూరోప్ ట్రిప్ అయిపోగానే సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోతాడు విజయ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.