జ‌గ‌న్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 13:29:14

జ‌గ‌న్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల ప‌ర్వకొన‌సాగుతూనే ఉంది. అప్ప‌ట్లో రాజ‌కీయంగా, ఇండ‌స్ట్రీ ప‌రంగా ఓ వెలుగు వెలిగిన ప్ర‌ముఖుల జీవిత క‌థ‌త‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కులు ప‌లు చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో మ‌రో రాజ‌కీయ వేత్త మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ తెక‌కెక్కుతుంది. 
 
రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. వైఎస్ పాత్ర‌లో ప్ర‌ముఖ మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబందించి కొన్ని ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను చిత్ర యూనిట్ హైద‌రాబాద్ లో కొంత‌వ‌ర‌కు పూర్తి చేసుకుంది. వైఎస్ పాత్ర‌తో పాటు ఈ చిత్రంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకం అందుకోస‌మే జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించే వారికోస్ తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది చిత్రం బృందం. గ‌తంలో జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ హీరో సూర్యా న‌టిస్తున్నార‌టూ కొద్ది కాలంపాటు సోషల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.
 
 అయితే ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాత్ర‌లో న‌టించ‌బోయే మ‌రో యంగ్  హీరో విజ‌య‌దేవ‌ర కొండ పేరు వినిపిస్తుంది. తెలుగులో ఇప్పుడు యూత్ లో విజ‌య‌య్ దేవ‌ర‌కొండకి మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు ఆయ‌న రాజ‌కీయల నేప‌థ్యంలో చేస్తున్నానోట ప‌ట్ల కూడా అభిమాను ఎంతో ఆస‌క్తి క‌రంగా ఎదురుచూస్తున్నాను. అందుకే జ‌గ‌న్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వై ఎస్ జగన్ పాత్రకి విజయ్ దేవరకొండ కరెక్టుగా సెట్ అవుతాడనే బలమైన నమ్మకం కూడా ఉండటంతో, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.