విజయ్ దేవరకొండ కి లక్ ఒక రేంజ్ లో ఉంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda hero
Updated:  2018-08-11 03:09:13

విజయ్ దేవరకొండ కి లక్ ఒక రేంజ్ లో ఉంది

ఒక్క హిట్ తోనే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ప్రస్తుతం తన "గీత గోవిందం" ని ఆగష్టు 15 న రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి వారం ముందు రిలీజ్ అయిన "శ్రీనివాస కళ్యాణం" ఇంకా "విశ్వరూపం 2" బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. నితిన్ "శ్రీనివాస కళ్యాణం" పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఎందుకంటే వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నఈ హీరో, సరిగ్గా ఆ సమయంలోనే దిల్ రాజు బ్యానర్ లో అనగానే వెంటనే "శ్రీనివాస కళ్యాణం" చేసాడు. కట్ చేస్తే ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో డల్ అయ్యింది.

ఇక కమల్ హాసన్ "విశ్వరూపం 2" విషయానికి విశ్వరూపం హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఎంత లక్కీ అని ఫీల్ అవుతున్నారు అందరూ. ఇదివరకు "పెళ్లి చూపులు" టైం లో రిలీజ్ అయిన "కబాలి" కూడా భారీ ఫ్లాప్ గా నిలిచింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.