విజయ్ దేవరకొండ వల్ల నష్టపోనున్న నాని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nai and vijay devarakonda
Updated:  2018-08-17 05:28:53

విజయ్ దేవరకొండ వల్ల నష్టపోనున్న నాని

తెలుగు ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ ఇప్పుడు పెను సంచనలంగా మారాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా అయిన "గీత గోవిందం" బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ సునామీ సృష్టిస్తుంది. అయితే ఇప్పుడు ఈ హీరోలు వల్ల ఇప్పటికే చాలా మంది హీరోలు తమ మార్కెట్ ని కోల్పోయారు. కానీ ఈ హీరోల్లో ఎక్కువగా నష్టపోయిన హీరో మాత్రం నాని అని విమర్శకులు అంటున్నారు.
 
మన తెలుగు రాష్ట్రాలలో పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉన్న నాని సూపర్ హిట్ సినిమాలలో చాలా మటుకు కామెడీ టచ్ ఉన్న సినిమాలే ఎక్కువ. ముఖ్యంగా "భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌" "ఎంసీఏ" "నేను లోకల్" లాంటి సినిమాలు అన్నీ నాని కామెడీ టైమింగ్ వల్లే పెద్ద హిట్ గా నిలిచాయి. కానీ ఇప్పుడు ఇదే కామెడీ టైమింగ్ విజయ్ దేవరకొండలో చూస్తున్నారు, అందుకే విజయ్ దేవరకొండ వల్ల నాని మార్కెట్ కి పెద్ద నష్టమే జరగనుంది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
 
ఇదిలా ఉంటే నానికి ఇప్పుడు "అర్జున్ రెడ్డి" లాంటి ఘన విజయం ఒకటి కావలి. కానీ నాని చేస్తున్న సినిమాలు ఏవి ఆ రేంజ్ లో హిట్ అయ్యేలా కనిపించట్లేదు. మరి నాని ప్రస్తుతం నాగార్జున తో కలిసి నటిస్తున్న "దేవదాస్" సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.