కాపీ కథతో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda hero
Updated:  2018-07-21 02:52:06

కాపీ కథతో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక జంటగా నటిస్తున్న సినిమా "గీత గోవిందం". ఫ్యామిలీ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన పరశురం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె" పాత సోషల్ మీడియా ఒక ఊపు ఊపేస్తుంది.

కానీ ఈ సినిమా కథ మాత్రం కాపీ అని తెలుస్తుంది. దర్శకత్వ శాఖలో పనిచేసిన నివాస్ అనే వ్యక్తి గీత గోవిందం కథ ని రాసుకున్నాడట దాన్ని కమెడియన్ జోగి నాయుడు తో తీయాలని అనుకున్నాడట కానీ కుదరలేదు కట్ చేస్తే అదే కథ తో ఈ సినిమా తెరకెక్కింది అని నివాస్ కి తెలియడంతో రచయితల సంఘం ని ఆశ్రయించాడు అంట.

మరి ఇప్పటి వరకు ఇలా చాలా సినిమాలకి జరిగింది కానీ అందరూ రాజీకి వచ్చి మ్యాటర్ ని సెటిల్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ "గీత గోవిందం" విషయం లో ఎం అవుతుందో చూడాలి. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.