ఈ అమ్మాయి ఎవ‌రు..? విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఈమెతో ఉన్న లింకేంటి..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda lover
Updated:  2018-10-05 11:52:31

ఈ అమ్మాయి ఎవ‌రు..? విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఈమెతో ఉన్న లింకేంటి..?

అర్జున్ రెడ్డి సినిమా సమయం లో సీనియర్ పొలిటీషియన్ అయిన వి.హెచ్ నే ఛిల్ల్ తాతయ్య అంటూ డేర్ గా కామెంట్ చేసిన మనస్తత్వం హీరో విజయ్ దేవరకొండ ది. విజయ్ ఏదైనా అంతే ఓపెన్ గా, ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంటాడు.. కానీ ఈసారి మాత్రం విజయ్ మాట దాటేశాడు. నోటా సినిమా రిలీజ్ దగ్గర పడడంతో విజయ్ పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు.

ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీడియా అడిగిన ప్రశ్నకు, విజయ్ స్ట్రెయిట్ గా ఆన్సర్ ఇవ్వకుండా హింట్స్ ఇచ్చుకుంటుపోయాడు.. ఇంతకీ ఏంటా ప్రశ్న.?, దానికి విజయ్ ఏం సమాధానం ఇచ్చాడు?అంటే.. మొన్న ఈమధ్య మీ ఫొటోస్ కొన్ని లీక్ అయ్యి, వైరల్ అయ్యాయి వాటి సంగతి ఏంటి అని మీడియా ప్రశ్నించగా.. మంచిగ అనిపిస్తోందా.. అమ్మాయి..?  నేను ఎలాగూ పబ్లిక్. కానీ కంఫర్ట్ లేనప్పుడు అమ్మాయిని లాగడం ఎందుకు?  అందుకే తనగురించి చెప్పను అంటూ సరదాగా వ్యాఖ్యనించాడు విజయ్.

అంతేకాకుండా ఫోటోల్లో ఉంది మీరే కదా, మీరే జవాబు చెప్పాలి అని అడగగా...అవి రెండేళ్ల క్రితం ఫోటోలు అని, అందులో ఉంది నేనే, ఎవరో మార్ఫింగ్ చేశారు అని చెప్పడం లాంటివి చెయ్యను అని అన్నారు.. అయితే ఆఫీషల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది అని మళ్ళీ మీడియా వాళ్ళు అన్నదానికి, దానిపైన మరో నెలరోజులు ఏస్కుంటుంది మీడియా ఎందుకులే అని మీడియా వాళ్ళకి చురక అంటించాడు విజయ్.. తను ఫ్రెండు మాత్రమేనా..?  లేక ఇంకెవరైనానా..? అని అడిగిన ప్రశ్న కి మాత్రం జవాబు చెప్పలేదు విజయ్. అయితే ఇంటర్వ్యూ తరువాత చాలామంది అమ్మాయిలకు విజయ్ సెల్ఫీలు ఇచ్చాడు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.