వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

devarakonda vijay
Updated:  2018-08-29 03:37:03

వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ ?

స్టార్ హీరో లీగ్ లోకి ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ తనకి 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు అంట. కానీ ఇప్పుడు స్టార్ ఇమేజ్ రావడంతో మరో అయిదేళ్ళలో పక్కా పెళ్లి చేసుకోవాలి అని విజయ్ అనుకుంటున్నాడు అని తెలిసింది.
 
అయితే విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది వరంగల్ అమ్మాయి అని టాక్. మొన్నామధ్య విజయ్ దేవరకొండ తన అన్న పెళ్లి కోసం వరంగల్ వెళ్ళాడు. అయితే అప్పుడు ఎం ఎల్ ఏ ఎర్రబెల్లి దయాకరరావు విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే అతడికి కూడా ఇక్కడి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి విజయ్ కి షాకిచ్చాడు.
 
తన వదిన వరంగల్ అమ్మాయే కాబట్టి పైగా మంచి మనసున్న అమ్మాయి కాబట్టి ఏమో, నాకు కూడా నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్ళి టాపిక్ వచ్చింది కాబట్టి విజయ్ తప్పకుండా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నారు అంతా. ఇకపోతే మొన్న ఒక రోజు విజయ్ ఒక అమ్మాయి నాకు సపోర్ట్ గా నిలిచింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ వరగంల్ అమ్మాయి ఒకటనేమో అని అందరి డౌట్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.