విజయ్ దేవరకొండకి ఎక్కువయ్యింది...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-09-08 12:34:17

విజయ్ దేవరకొండకి ఎక్కువయ్యింది...

‘మణిరత్నం’ భారతదేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఆయన తీసిన చిత్రాలకు ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. కథ కంటే ముఖ్యంగా కథనం పాత్రల తీరు మనసుల్ని ఆకట్టుకుంటాయి. అలంటి డైరెక్టర్ చేతిలో పడాలని ఈ తరం యువ హీరోలతో పాటు మనకి కూడా ఒక అవకాశం వస్తే బాగుణ్ణు అని పెద్ద హీరోలు సైతం ఆశ పడుతుంటారు.
 
కానీ ఇందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ, మణిరత్నం సినిమాలో ఛాన్స్ వద్దనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మణిరత్నం ఇప్పుడు ’నవాబ్’ అనే  చిత్రం పట్టాలెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, జ్యోతిక, విజయ్ సేతుపతి లాంటి మహామహులు ఈ చిత్రం లో స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. శింబు నటించిన పాత్రకి ముందుగా మణిరత్నం విజయ్ దేవరకొండ ని అనుకున్నా అతను వద్దనడంతో మణిరత్నం వెనుదిరిగారు.
 
అస్సలు అలాంటి అవకాశం రావడమే గొప్ప మళ్ళీ దాన్ని రిజెక్ట్ చెయ్యడం ఏంటి అంటూ కొంతమంది అభిమానులే పెదవి విరుస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన హిట్స్ కారణంగానే అతను బిజీ అయిపోయాడా లేదా వేరే కరణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా విడుదల అయిన “నవాబ్” ట్రైలర్ దుమ్ము దులిపింది. దానికి వచ్చిన క్రేజ్ చూసి మంచి అవకాశమే కోల్పోయాను అని విజయ్ చింతిస్తున్నట్లు సమాచారం.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.