విజయ్ దేవరకొండ లో మార్పు సాధ్యమేనా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-10-13 11:50:47

విజయ్ దేవరకొండ లో మార్పు సాధ్యమేనా..?

ఎవరూ ఊహించని విధంగా, కేవలం రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో సడెన్ గా స్టార్ లీగ్ లో చేరాడు విజయ్ దేవరకొండ. యువతలో అనూహ్యమైన క్రేజ్ ఉన్న విజయ్ కి శత్రువులు కూడా ఉన్నారు. శత్రువులు అంటే మరీ చంపేయాలి అనుకునేవాళ్ళు కాదు కాని విజయ్ స్టార్ డమ్ చూసి కుల్లుకునేవాళ్లన్నమాట. విజయ్ సినిమాలు సరిగ్గా ఆడకూడదు అని బాగా గట్టిగా కోరుకున్నట్టు ఉన్నారు ఈమధ్య విజయ్ నటించిన నోటా సినిమా డిజాస్టర్ అయింది.

అయితే, తనంటే పడని వారిపై, తన ఎదుగుదల చూసి ఓర్వలేని వారిపై విజయ్ ఈమధ్యనే నోరు విప్పాడు.  నోటా సినిమా ఫ్లాప్ అయ్యాక కొంతమంది పండగ చేసుకున్నారని, మరికొంతమంది పార్టీ చేసుకునే మూడ్ లోకి వచ్చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ. అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు తిట్టేవాళ్ళు, హిట్స్ వచ్చినప్పుడు పోగిడేవాళ్ళు ఉన్నట్టే సక్సెస్ అయితే చూసి తట్టుకోలేనివారు కూడా ఉంటారు.

అలాంటి వాళ్ళ నుండి తప్పించుకు పోవాలి కానీ కావాలని వారిపై ఇలా వివాదాస్పద కామెంట్లు చేయడం ఏమాత్రం బాలేదు అని కొందరు అంటున్నారు. ఆవేశంగా కామెంట్స్ చేయడం వల్ల విజయ్ కే నష్టమని, కాబట్టి విజయ్ కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు. చూద్దాం అర్జున్ రెడ్డి లానే బయట కూడా ప్రవర్తించే విజయ్ లో మార్పు వస్తుందో లేదో.

షేర్ :