టాక్సీవాలా సాంగ్ ని ఎవరు పాడారో తెలుసా..? విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-10-26 05:58:56

టాక్సీవాలా సాంగ్ ని ఎవరు పాడారో తెలుసా..? విజయ్ దేవరకొండ

తన చిత్రాల్ని వినూత్నంగా, కొత్తగా ప్రమోట్ చేసే హీరో లలో, అది కూడా మన టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. ఏదొక వివాదమో లేక ఫాన్స్ దగ్గరకి వెళ్లడం, ఏదైనా మంచి పని చెయ్యడం ఇలాంటి వాటితో తన సినిమా ని కూడా ప్రేక్షకుల్లోకి తీస్కెళ్ళిపోతాడు విజయ్.సోషల్ మీడియా లో కూడా విజయ్ దేవరకొండ ఆక్టివ్ గా ఫాన్స్ కి అందుబాటులో ఉంటాడు.

ఇక విషయానికి వస్తే విజయ్ నటించిన టాక్సీవాలా సినిమా నవంబర్ 6 న రిలీజ్ కానుంది. ఆ సినిమాకి సంబంధించిన పాట మాటే వినదుగా పాట లిరికల్ వీడియో ఈరోజు రిలీజ్ అయింది. దానికి సంబంధించి విజయ్ ట్విట్టర్ లో ఈ పాట ఎవరు పడారో చెప్పుకోండి అంటూ ప్రమోషన్ మొదలు పెట్టాడు. చాలా మంది సిడ్ శ్రీరామ్ అని రిప్లై ఇవ్వగా, కొంతమంది ఉయ్ నీడ్ రౌడీ అని ట్వీట్ కి రిప్లై గా ఇచ్చారు.

గీత గోవిందం సినిమా లో ఒక పాట పాడి, అందరి విమర్శలకి, భారీగా ట్రోల్స్ కి గురి అయిన విషయం ఇంకా ఎవరు మర్చిపోరు, ఈ నేపథ్యం లో విజయ్ పెట్టిన ట్వీట్ అందర్నీ అలరిస్తుంది. హీరో శ్రీ విష్ణు కూడా ఈ ట్వీట్ కి స్పందించాడు. ఈ పాట ఎవరు పడారో మాకు తెలుసు, అయిన మాకు రౌడి కావాలి అని సరదాగా రిప్లై ఇచ్చాడు.

షేర్ :