నాకు దానిపై న‌మ్మ‌కం లేదు.. విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-09-03 05:43:23

నాకు దానిపై న‌మ్మ‌కం లేదు.. విజయ్ దేవరకొండ

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ముందు మంచి క్యారెక్టర్ తో "ఎవడే సుబ్రహ్మణ్యం", ఆ తరవాత "పెళ్ళి చూపులు", ఆ తర్వాత "అర్జున్ రెడ్డి" ఇప్పుడేమో "గీతగోవిందం" ఒక్కో సినిమాతో ఒక్కోమెట్టు ఎక్కుతూ వచ్చాడు విజయ్ దేవరకొండ. అదేవిధంగా తన ఫ్యాన్ బేస్ కుడా పెరిగిపాయింది.

స్వయంగా మెగాస్టారే 5 సినిమాలతోనే స్టార్ అయిపోయావ్ అని విజయ్ పోగిదేసాడు. తన నటనే కాదు తను కుడా బోల్డ్ గానే ఉంటాడనేది ఆయన వాడే మాటలు అతని ఆటిట్యూడ్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఇదంతా అదృష్టం అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు విజయ్. తాను అదృష్టాన్ని అస్సలు నమ్మడ౦ట! కాని "గీత గోవిందం" తరువాత "టాక్సీ వాలా" దాని తరవాత "డియర్ కామ్రేడ్" అనే చిత్రాలు వరుసగా గీత ఆర్ట్స్ లో అంటే అది అదృష్టం కాక ఇంకేమిటి అంటున్నారు సినివర్గాలు.

"అర్జున్ రెడ్డి" కన్నా ముందు పెళ్లి చూపులు" తరవాత "అర్జున్ రెడ్డి" షూటింగ్ సమయంలోనే గీత ఆర్ట్స్ లో సినిమా ఖరారు అయ్యిందని "పెళ్లి చూపులు" విజయంలో నాది చిన్న పాత్ర, దర్శకుడు తరుణ్ భాస్కర్ వల్లే సినిమా ఆడిందని చెప్పుకొచ్చాడు ఈ కుర్ర హీరో. అదృష్టం లాంటివి ఎం ఉండవు కష్టేఫలి అంటున్నాడు. విజయ్ దేవరకొండ అన్న దాంట్లో లాజిక్ లేకపోలేదు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.