నోటా కి నొక్కండి అంటున్న విజయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

devarakonda vijay
Updated:  2018-09-20 11:17:06

నోటా కి నొక్కండి అంటున్న విజయ్

“గీతగోవిందం”  హిట్ తో ఊపుమీద ఉన్న విజయ్ కు మరో విజయం దక్కేలా కనబడుతుంది. ఇప్పటికే “నోటా” కి సంబంధించిన ట్రైలర్ కి అన్నిచోట్లా సానుకూల స్పందన రావడంతో విజయం ఖాయం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని విజయ్ దేవరకొండ ని ఈ పాత్రకి ఎంచుకోవటానికి అతని నటన సామర్ధ్యమా?? లేక యువతలో అతనికున్న ఫాలోయింగ్ ఆ అనేది ఎవ్వరికి తెలియదు. సినీ వర్గాలు మాత్రం అతనికున్న ఫ్యాన్ బేస్ మాత్రమే అంటున్నారు. 
 
రాజకీయ నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు మరియు తమిళ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల సెగ మొదలైంది. ఇటువంటి టైములో ఎవ్వరికి ఓటు వెయ్యొద్దు అంటూ “నోటా” ప్రచారం విజయ్ కి ప్రమాదమని చెప్పాలి. 
 
ఇప్పయికే తెలంగాణ లో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిమీద ఒకరు బురద చల్లుకుని కార్యక్రమాలు మొదలెట్టాసారు. తమిళ నాడు లో కూడా దాదాపు ఇదే పరిస్థిథి. ఇహ పోతే ఆంధ్రప్రదేశ్ కు కొంచెం టైం మిగిలున్నా అది చాలా తక్కువ వ్యవదే. 
 
ఈ సినిమాలో అసలు రాజకీయ నాయకులను నమ్మడానికి లేదు , గెలుపు కోసం ఎన్ని హామీలైనా ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు… అలాగే పదవి కోసం ఎలాంటి వాటికైనా సిద్దపడతారని అందుకే అలాంటి వాళ్ళని ఎన్నుకోకుండా నోటా కి నొక్కండి అంటూ సందేశం ఇవ్వనున్నాడు విజయ్ దేవరకొండ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.