రౌడీస్ కి సందేశం ఇచ్చిన విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay hero
Updated:  2018-10-04 02:02:18

రౌడీస్ కి సందేశం ఇచ్చిన విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి' సినిమా నుండి విజయ్ దేవరకొండ ప్రతి పని సెన్సేషనల్ గా మారిపోయింది. ఇప్పుడు తాజా చిత్రం నోటా రేపు రిలీజ్ కానుంది.నోటా రాజకీయ నేపధ్యంలో సాగబోయే సినిమా అవ్వడం వల్ల, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, ఎలక్షన్స్ దృష్ట్యా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది.

ఇప్పుడు విజయ్ ని జూ.ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకుంటున్నారు. అది ఎందుకంటే జూ.ఎన్టీఆర్ నటించిన "అరవింద సమేత'' సినిమా కూడా వారం గాప్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తారక్ ఫాన్స్ ,విజయ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ పోస్టుపోన్ చేస్కోమంటూ వత్తిడిచేస్తున్నారు. దీనికి విజయ్ స్పందిస్తూ, తారక్ అన్న తన సినిమా చూసాడని, తనకి నచ్చిందని చెప్తూ, సినిమా రిలీజ్ డేట్ మార్చేది లేదని చెప్పాడు విజయ్..

అంతే కాకుండా రిలీజ్ సమయంలో పోటీగా రిలీజ్ చేయొద్దని కొందరు ఫ్యాన్స్ చెప్పడం తనకు నచ్చలేదని చెప్తూ, ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు.. దాని సారాంశం ఏంటంటే మన సంఖ్య పెరిగేకొద్దీ మనం కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. మనం యువకులం కాబట్టి ఈ మార్పుకు శ్రీకారం చుట్టగలం అని ట్వీట్ చేసాడు ఈ రౌడి. చూడాలి ఈ ట్వీట్ ఎవరికి తగులుతుందో, ఎంత రచ్చ లేపుతాదో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.