దర్శకుడు అవ్వాలని రెండు కథలు రాసుకున్నా... విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda hero
Updated:  2018-10-04 03:50:30

దర్శకుడు అవ్వాలని రెండు కథలు రాసుకున్నా... విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇప్పుడంటే సెన్సేషనల్ స్టార్ కానీ, ఒకప్పుడు మనోడు సాదాసీదా నటుడే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా అవకాశం రావడానికే విజయ్ దగ్గరగా రెండేళ్లు ఆఫీసులు చుట్టూ తిరిగడాంట.. ఎన్నో ఆడిషన్స్ ఫేస్ చేసాడట ఈ విషయాన్ని విజయ్ ఏ స్వయంగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో.. ఎవడే సుబ్రహ్మణ్యం ముందు కథ లు వినేవాడంటా.. కానీ ఏ కథ గొప్పగా అనిపించేది కాదు అట..

విన్న కధలు చెత్త గా అనిపించడంతో, ఈ కథలు చెయ్యడం మనవల్ల కాదనుకొని స్వయంగా కథలు రాయడం మొదలెట్టడంట, రెండు కధలు కూడా పూర్తి చేసిన విజయ్ దర్శకుడు అవ్వాలనికూడా అనుకున్న సమయంలో ఎవడే సుబ్రమణ్యం స్టోరీ విజయ్ దగ్గరకి వచ్చింది. ఆ తరువాతి నుండి విజయ్ దగ్గరకి మంచి కథలు రావడం మొదలైంది అని చెప్పాడు విజయ్. ఆ సమయం లో తనకో విషయం అర్థమైంది అని విజయ్ ఇంటర్వ్యూ లో చెప్పాడు. మొదట్లో మన రచయితలు చెత్త కధలు రాస్తున్నారేంటి అని భావించా అని, కానీ తనకి అప్పుడు పేరు లేదు కాబట్టి పెద్ద హీరోల దగ్గర ఆ కధలు ఆగిపోయి, తనకి చెత్త కధలు వచ్చేవని తెలుసుకున్న అని విజయ్ అన్నాడు.

అందుకే ఇప్పుడు స్టోరీల విషయంలో జాగ్రత్త తీసుకొని వింటున్నాను, వరుసగా సినిమా లు చేస్తున్నాను అని విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ లో చెప్పాడు. పిండికొద్ది రొట్టె అని, హీరో బట్టి కథ అని మనోడికి అర్థం అవ్వడానికి ఇంతకాలం పట్టిందన్నమాట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.