కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-25 04:12:09

కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ.

సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" తరువాత వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అందులో ఒకటి "టాక్సీ వాలా" కాగ మరొకటి "గీత గోవిందం". ఈ రెండు సినిమాల యొక్క టిజర్స్ రిలీజ్ కూడా అయ్యాయి.
 
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కి తమిళ్ లోనే కాకుండా కన్నడ లో మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా అక్కడ వాళ్ళు "గీత గోవిందం" టిజర్ చూసాక ఆ మూవీ పై ఇంకా అంచనాలు పెంచేసుకున్నారు. ఇంకా ఆ సినిమాలో కన్నడ స్టార్ హీరోయిన్ అయిన రష్మిక నటించింది. అందుకే ఈ సినిమా కోసం వారు అంతలా ఎదురు చూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ ప్రొడ్యూసర్స్ విజయ్ ని హీరోగా పెట్టి కన్నడ లో కూడా సినిమా తీయాలి అని ప్లాన్ చేస్తున్నారు అంట. ప్రస్తుతానికి అయితే విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ ఆఫర్ విజయ్ వరకు వస్తే ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.