కాపీ కొట్టిన పాటని ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-11-02 12:21:00

కాపీ కొట్టిన పాటని ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

ఈ మధ్యకాలం లో తన పాటలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన సింగర్ సిడ్ శ్రీరామ్.విజయ్ దేవరకొండ కెరీర్ కలెక్షన్స్ పరంగా హిట్ అయిన గీత గోవిందం సినిమాలో పెద్ద హిట్ అయిన పాట ఇంకేం ఇంకేం కావాలె పాట కుర్రకారుని ఊపిన తీరు ఇంకా ఎవరు మర్చిపోయి ఉండరు.. ఆ పాట అంతలా హిట్ కావడానికి ప్రధాన కారణం సిడ్ శ్రీరామ్.

అయితే ఆ పాట కనుమరుగు కాకముందే సిడ్ మరొక పాట తో మళ్ళీ ముందుకు వచ్చాడు. అది కూడా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం లోది. అయితే ట్విట్టర్ వేదిక గా విజయ్ సిడ్ శ్రీరామ్ ని భారీ గా ప్రమోట్ చేస్తున్నాడు. సిడ్ తన ఫేవరేట్ యాక్టర్ అంటూ సిడ్ శ్రీరామ్ పాడి, వీడియో గా మలచిన ఇట్ ఇస్ ఇంట్ ట్రూ అనే వీడియో ని షేర్ చేసాడు విజయ్ దేవరకొండ. దానికి కాప్షన్ గా నా ఫేవరేట్ సింగర్ సిడ్ శ్రీరామ్ అని రాసాడు.విజయ్ షేర్ చెయ్యడం తో దీన్ని చాలా మంది వీక్షించారు.

అయితే కొందరు మ్యూజిక్ లవర్స్ మాత్రం ఈ సాంగ్ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. సిడ్ ఈ పాట ని జ్యాన్ మాలిక్ పాట అయిన ఇట్స్ యూ నుండి కాపీ చేశాడని, ఇలా కాపీ కాట్స్ ని ప్రోత్సహించొద్దు అని విజయ్ కి కామెంట్స్ పెడుతున్నారు కొందరు మ్యూజిక్ లవర్స్.

షేర్ :

Comments

0 Comment