స్టార్ డం రాగానే రూటు మార్చిన విజయ్ దేవరకొండ..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-10-05 04:03:21

స్టార్ డం రాగానే రూటు మార్చిన విజయ్ దేవరకొండ..

ఇప్పుడు స్టార్ హీరోలు అవ్వాలంటే, ఒకప్పుడు స్టార్ హీరో అయిన తండ్రి, లేదా స్టార్ ప్రొడ్యూసర్ అయిన తాత మనకి ఉండాలి.. కానీ వాటి అన్నిటికి అతీతం గా తక్కువ టైం లో స్టార్ హీరో అంత రేంజ్ కి ఎదిగిన సంచలన హీరో విజయ్ దేవరకొండ.. ఈ మాట స్వయం గా మెగాస్టార్ చిరంజీవి గీత గోవిందం ఫంక్షన్ లో చెప్పిన మాట.. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి చాలా ఏళ్ళ శ్రమ ఉంది.. కానీ విజయ్ మాత్రం రెండేళ్ల ప్రస్థానం లోనే కుర్రహీరో లలో టాప్ రేంజ్ కి చేరుకున్నాడు..

తాను మాత్రం ఇంకా ఒక స్టార్ అయిపోయినట్టు కాదని, ప్రతి సినిమా కూడా ఇదే చివరిది అన్న ఫీలింగ్ తో కష్టపడుతునట్టు విజయ్ చెప్పాడు.. ఐతే తాను ఈ విజయాలు అందుకోవడానికి ముందు.. ఇప్పుడు ఉన్న తేడా మాత్రం ఒక్కటే అని చెప్పాడు. ఇంతకుముందు తనకేదైనా సీన్ నచ్చకపోతే.. నచ్చలేదు అని చెప్పే రేంజ్ లేదు కాబట్టి చెప్పలేకపోయేవాడ్ని... నచ్చినా నచ్చకున్నా తప్పక చేయాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు ఒక సీన్ సరిగా లేకుంటే చెప్పి చేంజ్ చెయ్యపించగల్గుతున్నా అని చెప్పాడు విజయ్...

గతం లో కూడా 'అర్జున్ రెడ్డి సినిమాలో  సీన్ కూడా మార్చమని అభ్యర్దించినట్టు గుర్తుచేస్కున్నాడు విజయ్... తనకు రియల్ గా అనిపించకపోతే , అసహజంగా అనిపిస్తే అది ఏ సినిమా కానీ.. ఏ పాత్ర కానీ చేయనని విజయ్ స్పష్టం చేశాడు. ఒక వేళ తాను పెద్ద కమర్షియల్ సినిమాలు చేసినా ఇంతే అని తేల్చి చెప్పేశాడు విజయ్..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.