ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయనకే నా ఓటు- విజయ్ దేవరకొండ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-10-05 12:06:23

ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయనకే నా ఓటు- విజయ్ దేవరకొండ

నోటా సినిమా ప్రమోషన్స్ లో భాగం గా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఏ పార్టీ కి ఓటు వేస్తా అనేది బహిరంగంగానే చెప్పాడు విజయ్ దేవరకొండ. మీరు పొలిటికల్ సినిమా చేశారు కదా, మరి మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు. అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు, విజయ్ స్పందిస్తూ...నేను క్రితం ఎన్నికలకి టి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేసా. ఈసారి కూడా అదే పార్టీ కి ఓట్ చేస్తా అని చెప్పారు.

తనకి కె.టి.ఆర్ ఐడియాలజీ మీద పూర్తి నమ్మకం ఉందని, అందుకే మళ్ళీ ఆ పార్టీకే నా ఓట్ అని చెప్పాడు ఈ సంచలనల హీరో.పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన నోటా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాపై రెండు పరిశ్రమల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి..

విజయవాడలో జరిగిన నోటా సినిమాకి సంబంధించిన ఫంక్షన్ లో యూత్ అందరి చేత ఓటు విషయం లో విజయ్ దేవరకొండ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.. కానీ విజయ్ మాత్రం తాను ఓటు ఎవరికి వేయాలో ఒక క్లారిటీ తో ఉన్నాడు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.