మహేష్ బాబు పై సంచలన‌ వ్యాఖ్యలు చేసిన విశాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and vishal
Updated:  2018-09-18 11:22:12

మహేష్ బాబు పై సంచలన‌ వ్యాఖ్యలు చేసిన విశాల్

స్టాండ్ అప్ కమెడియన్ మనోజ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై అనూచిత వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దానికిగాను అతనిని సామజిక మాధ్యమాలలో మహేష్ అభిమానులు ఒక ఆట ఆడుకుంటున్న సంగతి తెలిసిందే.
 
దీనిపై తగు చర్యలు తీస్కోవాలంటూ “మా” నడిగర్ సంఘానికి ఒక లేఖ రాసింది. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ తాజాగా ఈ లేఖకు ప్రతుత్తరం తెలిపాడు. “ప్రతి విషయాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. మహేష్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీలేదు. ఆయన చాలా ఫేమస్. మహేష్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు.” అంటూ అటు కర్ర విరక్కుండా పాము చావకుండా అనే చందాన జవాబిచ్చాడు.
 
అస్సలు మనోజ్ అనే వ్యక్తే తమకి తెలియదని. అతను మా సంఘ సభ్యుడు కాదని అభిమానులు ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోవద్దని చెప్పాడు. పేరున్న వ్యక్తులను దూషిస్తే తాము ఫేమస్ అవుతామనే ధోరణి లో కొంతమంది ఉంటారు. ఈ మనోజ్ కుడా అదే కోవకి చెందిన వ్యక్తి. అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చాలా కామన్. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.” ఇకపై మనోజ్ ను పట్టించుకోవద్దని కోరాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.