"బాహుబలి 2" రికార్డ్స్ ని బద్దలు కొట్టిన ఫ్లాప్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bahubali 2
Updated:  2018-08-13 15:56:58

"బాహుబలి 2" రికార్డ్స్ ని బద్దలు కొట్టిన ఫ్లాప్ సినిమా

యూనివర్సల్ హీరో అయిన కమల్ హసన్ హీరో గా నటించి డైరెక్ట్ చేసిన సినిమా "విశ్వరూపం 2". 2013 లో తెరకెక్కిన "విశ్వరూపం" కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే ఎన్నో అడ్డంకుల తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా తోలి రోజు నుంచే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.

చెన్నైలో "బాహుబ‌లి 2" మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని "విశ్వ‌రూపం 2" బ‌ద్ద‌లు కొట్టింది. దాంతోపాటు, త‌మిళ‌నాడులో ఈ సినిమా తొలిరోజు మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. చెన్నైలో "బాహుబలి-2" ఫస్ట్ డే 92 లక్షలు వ‌సూలు చేయ‌గా "విశ్వ‌రూపం 2" తొలిరోజు 93ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.

చెన్నైలో తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రాల జాబితాలో "విశ్వరూపం 2" ఆరో స్థానంలో ఉంది. పూజ కుమార్ ఇంకా ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో రన్ అవుతుంది. కొంత మంది అయితే దీని కంటే కూడా మొదటి భాగమే బాగుంటుంది అనే వారు కూడా లేకపోలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు