ఆసిడ్ పోసి చంపుతామని చిన్మయి కి బెదిరింపులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

singer chinmayi
Updated:  2018-10-22 12:02:54

ఆసిడ్ పోసి చంపుతామని చిన్మయి కి బెదిరింపులు

మీటూ ఉద్యమం సౌత్ లో ఊపు అందుకుంది ఒకరకంగా చిన్మయి వల్లనే. ఇప్పటికే ఆమె తన అనుభవాలు అలాగే కొందరు బాధితుల కథలు ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు వరుస బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయం తాజాగా చెన్నైలో విలేకరుల సమావేశంలో స్వయంగా తానే చెప్పింది.

లైంగిక వేధింపులపై ట్విట్టర్ లో బాధితుల ఆరోపణలను బయటకు చెపితే తనను చంపేస్తామని, యాసిడ్ పోస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. అంతే కాక బోలెడు అర్థంలేని ప్రశ్నలతో తనను వేధిస్తున్నారని, ఎపుడో జరిగిపోయిన విషయాలను ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నామని అడుగుతున్నారని తెలిపింది. ఇక ఇలానే మహిళల గొంతులు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి.

ఇప్పటికే ప్రముఖ లిరిసిస్ట్ అయినట్టు వంటి వైరముత్తు చాలా మంది స్త్రీలను లైంగికంగా వేధించాడని, అతడిపై ఆధారాలు సేకరించి కచ్చితంగా కేసు వేస్తానని చిన్మయి స్పష్టం చేసింది. అలాగే మహిళల రక్షణకే తాము ఈ మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఇక ఇప్పటికే పలువురు పెద్దవాళ్ళ పేర్లు బయటికి వచ్చాయి. ఈ లిస్టులో తాజాగా చేరిన పేర్లు నటుడు జాన్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ ఉమాశంకర్, వీరిపై బుల్లితెర యాంకర్ శ్రీరంజిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 

షేర్ :

Comments

0 Comment