అసలు నాగ చైతన్య కెరీర్ కి ఏమవుతుంది ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

naga chaitanya
Updated:  2018-08-21 12:34:42

అసలు నాగ చైతన్య కెరీర్ కి ఏమవుతుంది ?

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం “శైలజా రెడ్డి అల్లుడు”. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య కి అత్తగా రమ్య కృష్ణ నటించింది. అలాగే నాగ చైతన్య భార్యగా అను ఎమన్యుఎల్ నటించింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్.నాగ వంశీ ప్రొడ్యూస్ చేసాడు, ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు అన్నిపూర్తి చేసుకున్న ఈ సినిమా ని ఆగష్టు 31 న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
 
అయితే విడుదల తేదీ ఇంకా పది రోజులు ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటి వరకు పూర్తి కానట్టే కనిపిస్తోంది, దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి, సినిమా సెన్సార్ పదిరోజుల్లో పూర్తిఅవుతుందా లేదా అనేదే ప్రశ్న అందుకే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నాగ చైతన్య అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే అచ్చం ఇలాగే "సవ్యసాచి" పరిస్థితి కూడా ఉంది.
 
అసలు ఆ సినిమా కూడా ఎప్పువు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలియట్లేదు. ఇకపోతే  నాగ చైతన్య కి ఇప్పటి వరకు ఒక స్ట్రాంగ్ హిట్ లేదు. నాగ చైతన్య గత సినిమా అయిన "యుద్ధం శరణం" సినిమా అయితే ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.