అసలు నాగబాబు గొంతుకి ఏమైంది..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagababu
Updated:  2018-08-17 01:13:40

అసలు నాగబాబు గొంతుకి ఏమైంది..?

నాగబాబు అంటే అందరికి హైట్ తో పాటు గంభీరమైన గొంతు కూడా గుర్తుకి వస్తుంది, కానీ గాని కొంత కాలంగా ఆయన గొంతు అస్సలు బాగుండటం లేదు. ఈ మధ్య ఆడియో వేడుకల్లో లో ఆయన చాలా ఇబ్బంది పడుతూ మాట్లడుతున్నాడు. అయితే నాగ బాబు ఇటివలే "గీత గోవిందం" సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రిగా నటించాడు.
 
కానీ ఆయన గొంతు బాలేకపోవడం వల్ల ఈ పాత్రకి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు మూవీ యూనిట్. అలాగే జబర్దస్త్ ప్రోగ్రాం లో ఆయన జడ్జిగా మాట్లాడేటపుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాయిసే సరిగా రావట్లేదు. ఈ మధ్య మరీ ఇబ్బందికరంగా తయారై అసలు మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు.
 
మరి ఇన్ని నెలల పాటు గొంతు బొంగురు పోయి ఇప్పుడీ స్థాయికి చేరుకుందంటే సమస్య కొంచెం సీరియస్ గానే ఉంది అని అర్ధం అవుతుంది. అయితే దీని కోసం నాగ బాబు త్వరలో ఫారిన్ వెళ్లనున్నాడు అని తెలిసింది, అక్కడ సర్జరీ చేయించుకున్నాక మళ్ళి తిరిగి హైదరబాద్ వస్తాడు అంట. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో లో నాగ బాబు అతిగా నవ్వడం వల్లే ఇందంతా జరుగుతుంది అని నాగ బాబు సన్నిహితులు అంటున్నారు.

షేర్ :