పవన్ కళ్యాణ్ నిర్మాతకి ఏమైంది ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-08-07 17:43:53

పవన్ కళ్యాణ్ నిర్మాతకి ఏమైంది ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అని ఎంతో మంది నిర్మాతలు వెయిట్ చేస్తారు, కానీ శరత్ మారార్ కి మాత్రం అడగకుండానే ఆయనతో కలిసి రెండు సినిమాలు చేసాడు పవన్ కళ్యాణ్. శరత్ మారార్ నిర్మించిన ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రేంజ్ లో ఫ్లాప్ అయ్యాయి.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు ఆపేసాడు. అయితే ఇప్పుడు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన శరత్ మారార్ చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇద్దరు కొత్తవాళ్ళని హీరో హీరోయిన్స్ పరిచయం చేస్తూ "ప్రేమకు రైన్ చెక్" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు.

అసలు శరత్ మరార్ ఏంటి ఇలా చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఏంటి అని అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో ఆయనకీ వచ్చిన విభేదాల వల్లే శరత్ మారార్ పరిస్థితి ఇలా అయ్యింది అన్నవారు కూడా లేకపోలేదు. మరి ఈ సినిమా తరువాత అయిన శరత్ మారార్ స్టార్ హీరోస్ తో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడో లేదో చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.