చిరు చేయలేకపోయిన ఆ కథ ఏంటి..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi
Updated:  2018-09-29 11:40:37

చిరు చేయలేకపోయిన ఆ కథ ఏంటి..?

పరుచూరి గోపాల కృష్ణ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ మధ్య ఆయన తన యూట్యూబ్ లో చాలా ఆక్టివ్ గా ఉంటూ పాత విషయాలను మరిచిపోతున్న వారి గొప్పతనాన్ని గుర్తు చేస్తూ నిజంగా సినీ పరిశ్రమకు సేవ చేస్తున్నారు. వారికి ఎదురైన సంఘటనలు, జ్ఞాపకాలను ఆయన నేటి తరానికి అందిస్తున్నారు.

తాజాగా అయన దర్శకుడు ఎ. మోహనగాంధి గొప్పతనం గురించి వివరించాడు.. మోహన గాంధీ గారు సామాజిక సమస్యలను చిత్రాలుగా తీయడంలోనే కాదు.... అయన పాటలను కూడా అద్భుతంగా తీయగలరు.  అయన తీసిన కర్తవ్యం, టెర్రర్, ఆశయం, ఆడపడుచు వంటి సినిమాలకు మేము పనిచేయడం వాళ్లు పనిచెయ్యడం అదృష్టం అని చెప్పారు. బడా బడా నిర్మాతలు కూడా మోహన గాంధీతో సినిమాలు చేయడానికి ఆరాటపడేవారు. కానీ అయన మాత్రం చిన్న సినిమాలు చేయడానికే మొగ్గు చూపేవారు.

అలా అయన శివకృష్ణ హీరోగా తీసిన ఆడపడుచు సినిమా అద్భుతమైన విజయన్ని సాధించింది.చిరంజీవి గారు ఆ సినిమా చుసిన తర్వాత తనకి అటువంటి సినిమా చేయాలనీ ఉన్నదని, అలాంటి కథలు తనకి కూడా కావాలని వారిని అడిగారని గోపాల కృష్ణ చెప్పారు. నిజానికి ఆ కథ తనకి వచ్చుoటే బాగుండు అని బాధ పడ్డారట.!!  ఆ కథ పెద్ద హీరోలకు కూడా బాగా సెట్ అయ్యేదని మాకు అనిపించింది అని అయన చెప్పాడు. .

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.