అసలు ఎవ‌రు ఈ దేత్త‌డి హారిక‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dettadi harika
Updated:  2018-09-03 05:24:37

అసలు ఎవ‌రు ఈ దేత్త‌డి హారిక‌

రీసెంట్ గా “దేత్తడి” అంటూ ఒక యువతి యూట్యూబ్ లో మంచి హడావిడి చేస్తోంది. ఈమె పెరు అలేఖ్య హారిక. మంచి కంటెంట్ ని ఎప్పుడు యువత ప్రోత్సహించడం మానరు. అలాగే ఈమె కూడా తన వైవిధ్యమైన వీడియోలతో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఆమె కొత్త సినిమా డైరెక్టర్లు పడే కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించి అందరి మన్నలను పొందుతుంది.
 
ఈ వీడియో లో ఆమె రకరకాల నిర్మాతల దగ్గరకి వెళ్లడం, ఆయా నిర్మాతల తాలూకు మార్పులు చేర్పులను అంగీకరించడానికి ఈమె పడే పాట్లు. సర్లే అని ఒక పెద్దమనిషి చిన్న డెమో ఫిల్మ్ తీయి అవకాశం ఇస్తా అనడంతో ఈమె నటుల కోసం వేట మొదలుపెట్టడం. రకరకాల మనుషులు రావడం ఇవన్నీ నిజంగా ఒక సినిమా తీయాలంటే పడాల్సిన పాట్లు అని క్లియర్ గా చూపించారు.
 
చివర్లో "మను" చిత్రంలో నటించిన మను కనిపించి ఆ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇదొక్కటనే కాదు అలేఖ్య హారిక సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈమెకి ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా కూడా సోషల్ మీడియా లోనే తనకి కంఫర్ట్ అనుకుంటూ ఇక్కడే ఉండిపోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.