అల్లు అర్జున్ అందుకే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-08-20 16:03:07

అల్లు అర్జున్ అందుకే

విజయ్ దేవరకొండ "గీత గోవిందం" సినిమాతో హిట్టు కొట్టి తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన పరశురాం ఈ సినిమాని మొదట అల్లు అర్జున్ కోసం అనుకోని అల్లు అర్జున్ ని కథ చెప్పాడు అంట. అయితే అదే టైం లో అల్లు అర్జున్ "సరైనోడు" లాంటి మాస్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు.

అప్పటికే ఒక మాస్ సినిమా చేసి హిట్ అందుకున్న బన్నీ మళ్ళి వెంటనే క్లాస్ సినిమా అంటే ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయంతో "గీత గోవిందం" ని రిజెక్ట్ చేసాడు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాని రిజెక్ట్ చెయ్యగానే వెళ్లి విజయ్ దేవరకొండ కి కథ చెప్పాడు అంట పరశురాం. మొదటిసారి "గీత గోవిందం" కథ విన్నప్పుడు విజయ్ కి పెద్దగా అనిపించలేదట. దాంతో మరోసారి కథ విన్నాడట.

అయితే అప్పుడు మాత్రం కనెక్ట్ అయ్యాడట విజయ్. దాంతో ఆ సినిమా చేసాడు సూపర్ హిట్ కొట్టేసాడు. ఫైనల్ గా విజయ్ కి ఈ సినిమా చేయాలి అని రాసి పెట్టి ఉంది కాబట్టి సినిమా లో నటించి హిట్టు కొట్టాడు అని అంటున్నాయి సినీ వర్గాలు.

 

షేర్ :