దొంగ చాటుగా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఆ హీరోయిన్ కి ఎందుకు వచ్చింది ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine
Updated:  2018-09-03 12:29:59

దొంగ చాటుగా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఆ హీరోయిన్ కి ఎందుకు వచ్చింది ?

తిరుమలకి ఎవరన్న వెళితే ఏం చేస్తారు..? కుదిరితే తలనీలాలు అర్పించి తర్వాత దర్శనం చేసుకుంటారు. పేరున్న సెలబ్రిటీస్ తిరుమల వెళితే వి వి ఐ పి దర్శనం చేస్కుకుని ఎవ్వరికి చిక్కకుండా చెక్కేస్తారు. ఒకవేళ మీడియా వారికీ దొరికిపోతే దైవదర్శనం బాగా అయ్యింది, దేవుడు అందరిని చల్లగా చూడాలని కోరుకున్నాం అంటూ సర్వేజన సుఖినోభవంతు సుక్తులు వల్లిస్తారు.

కాని ఒక సీనియర్ మోస్ట్ హీరొయిన్ మాత్రం మీడియాకి చిక్కినా సరే ముఖం కప్పుకుని ఉడాయించింది. ఇది ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ఎవరామే అనుకుంటున్నారా? ఇంకేవ్వరండి మన శ్రేయ నే. అయితే తను అలా చెయ్యడానికి కారణం లేకపోలేదు లెండి!! మొన్న 2008 ఒకసారి ఈమె స్వామి వారి దర్శనం కోసం వెళ్లి వస్తున్నప్పుడు మీడియా వారు చుట్టుముట్టారు.

ఆ సమయం లో వెనకనుండి ఒక తుంటరి అసభ్యకరంగా ప్రవర్తించాడు దాంతో ఈ అమ్మడు లాగి ఒక్కటి పీకింది. అప్పుడు ఆ పీకుడు పెద్ద రచ్చ అయ్యింది. మళ్ళి అదే రిపీట్ అవ్వుద్దేమో ఎందుకొచ్చిన గొడవ అనుకుని మొహం కప్పుకుని తప్పించుకుంది.గతంలో ఇలాంటి సంఘటనలు చాలా మంది హీరొయిన్ లకు జరిగాయి. కాకపోతే వారు అలా జరిగిన తర్వాత పుణ్యక్షేత్రాల ప్రయాణాలు తగ్గించారు. కాని శ్రేయ మాత్రం అవేమి పట్టించుకోకుండా మళ్ళి ధైర్యంగా స్వామి దర్శనానికి బయల్దేరింది. ఈ విషయం లో మాత్రం ఈమెను మెచ్చుకోవాలి సుమీ!

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.