నితిన్ మళ్ళి ఫ్లాప్స్ బాట ఎందుకు పట్టాడు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nithin
Updated:  2018-08-29 06:16:32

నితిన్ మళ్ళి ఫ్లాప్స్ బాట ఎందుకు పట్టాడు ?

వరుసగా 16 పరాజయలతో విసిగిపోయిన నితిన్ కి, ఓ ప్రియ ప్రియ అంటూ విక్రమ్ "ఇష్క్" రూపంలో మంచి కిక్ ఇచ్చే విజయాన్ని అందిచి మళ్ళీ ఓ ట్రాక్ లో పెట్టాడు. ఆ తర్వాత “అ ఆ” వరకు అతనికి తిరుగులేకుండా పోయింది.ఇంకా చెప్పాలంటే తన మార్కెట్ పెరిగింది.

కానీ త్రివిక్రమ్ తో పని చేసిన తరువాత తీసిన సినిమాలన్నీ పరాజయం మూతగట్టుకున్నాయి. ఎన్నో ఆశలతో హను రాఘవపూడి తీసిన “లై” బొక్కబోర్లా పడటంతో మళ్ళీ త్రివిక్రమ్ కథలో దూరాడు. కానీ ఈ సారి నితిన్ కి చుక్కెదురైంది. "చల్ మోహన్ రంగ" కూడా నిరుత్సాహ పరిచింది. ఇవన్నీ పనవ్వలేదనుకున్న నితిన్ దిల్ రాజు తో కలిసి పది సంవత్సరాల తరువాత రాసి ఖన్నా తో జతకట్టి “శ్రీనివాస కళ్యాణం” లో నటించాడు.

అదృష్టం ఈసారి కూడా వరించకపోగా డిజాస్టర్ ని కానుక ఇచ్చి పోయింది. దీంతో సంగదిగ్ధంలో పడ్డాడు మన హీరో. తన పాత రోజులు మళ్లీ వచ్చేశాయమో అనుకున్న ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రానికి ఛలో ద్వారా హిట్ కొట్టిన వెంకీ కుడుముల చేతిలో పెట్టడంటా! ఈసారైనా హిట్ కొట్టి ఈ మూడు డిజాస్టర్ ల బాధనుండి తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు నితిన్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.