ఆ హీరో కి సమంతా ఎందుకింత సపోర్ట్ చేస్తుంది?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-08-20 05:03:59

ఆ హీరో కి సమంతా ఎందుకింత సపోర్ట్ చేస్తుంది?

స్టార్ హీరోయిన్ అయిన సమంతా కి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారిలో సమంతా ఎక్కువ క్లోజ్ గా ఉండేది హీరో రాహుల్ రవీంద్రన్ తో అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇదివరకు తమిళ్ లో జంటగా ఒక సినిమాలో కూడా నటించాడు.

అయితే ఇటివలే రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి "చి.ల.సౌ" అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాకి సమంతా ఫుల్ సపోర్ట్ ని ఇచ్చింది. తానూ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కి నాగ చైతన్య కి కూడా తీసుకొని వచ్చింది సమంతా. ఇది మాత్రమే కాదు నాగార్జున ని ఒప్పించి మరి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేయించింది సమంతా.

అయితే ఇప్పుడు మళ్ళి రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసే సెకండ్ సినిమాకి కూడా సమంతా బ్యాక్ బోన్ గా నిలుస్తుంది అని టాక్. రాహుల్ తన సెకండ్ సినిమాని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ విషయం లో రాహుల్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అంట సమంతా. రాహుల్ కి ఎలా అయిన తన మామ డేట్స్ ఇవ్వాలి అని సమంతా పట్టుబట్టుకొని కూర్చుంది అని టాక్. 

షేర్ :