తాగుబోతులు ఇలా ఆలోచిస్తారా....

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-14 06:16:16

తాగుబోతులు ఇలా ఆలోచిస్తారా....

మ‌న‌కు జ‌రుగుతున్న‌ది అన్యాయం అని తెలిసినా, ఎవ‌రు చేస్తున్నారు అని తెలిసినా మ‌నం ప్ర‌శ్నించ‌లేక పొతున్నాము. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో జ‌రిగే న‌ష్టాన్ని మ‌నం అంచ‌నా వేయ‌లేము. మ‌న భావిత‌రాల‌కు మంచి స‌మాజాన్ని,వ్య‌వ‌స్థ‌ను అందించ‌డంలో మ‌నం విఫ‌లం అవుతున్నామ‌ని అంగీక‌రించాల్సిందే. ఇంతకీ ఆ విష‌యం ఏమిటంటే?
 
అయితే మ‌ద్య‌పానం సేవించే వ్య‌క్తులు మాత్రం అన్యాయాన్ని,అక్ర‌మాన్ని పూర్తిగా వ్య‌తిరేకించి పొరాటం చేస్తున్నారు. ఈ వ‌ర్గానికి ఉన్నటువంటి  చైత‌న్యం మ‌రే వ‌ర్గానికి ఉండ‌ద‌నుకోవాలేమో.... దీనికి కార‌ణం ఏమిటంటారా..? తెలంగాణ ఎక్సైజ్ శాఖ  వినియోగ‌దారుల కొసం ఒక కొత్త‌ యాప్ విడుదల చేసింది.... మ‌ద్యం  విక్ర‌యాలు చేసే వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా యాప్‌లో  ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.
 
ఈ అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు బాధితులు. యాప్ వ‌చ్చిన రెండు రోజుల‌కే 659 ఫిర్యాదులు నమోదు చేశార‌ట‌.... బాటిల్ పై MRP క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్న‌ట్లు అత్యధికులు ఫిర్యాదు చేశార‌ట‌. తెలంగాణ రాష్ట్రంలో 2200 పై చిలుకు మద్యం షాపులు  ఉన్నాయి. రిటైల్ షాపుల మధ్య  పోటీలో కూడా కొన్ని ఫిర్యాదులు రావచ్చని బావిస్తున్నారు అధికారులు. వ‌చ్చిన ఫిర్యాదుల పై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ సబర్వాల్ తెలిపారు.  
 
 

 

షేర్ :

Comments

1 Comment

  1. sss

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.