నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసిన మహిళ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:48:31

నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసిన మహిళ

అక్కినేని నాగార్జున కి లేడీస్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే నాగ్ ని లేడీ అభిమానులు అందరూ మన్మధుడు అని పిలిచుకుంటారు. అంత లేడీ ఫాలోయింగ్ ఉన్న నాగార్జున కి ఒక యువతి షాక్ ఇచ్చింది.

అక్కినేని నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసి నానా హంగామా చేసింది ఈ యువతి. నాగార్జున నాకు 4 కోట్ల రూపాయలు ఇవ్వాలని, నన్ను లోపలకు పంపించండి అంటూ పెద్ద గొడవ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు నాగార్జున సెక్యూరిటీ. దాంతో నాగార్జున ఇంటికి చేరుకున్న పోలీసులు ఆ యువతి ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఫైనల్ గా పోలిసుల విచారణలో తెలిసింది ఏంటంటే ఆ యువతికి మతిస్థిమితం లేదు అట.ఆదిలాబాద్ నుంచి కేవలం నాగార్జున ని చూడాలని హైద‌రాబాద్‌ కి వచ్చిందట ఈ యువతి. ఆ తర్వాత నాగార్జున నాకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని గొడవ చేయడం సంచలనం సృష్టించింది. కాని ఈ గొడవ అంత తన ఇంటి ముందు జరిగే టైం లో నాగార్జున ఇంట్లో లేరు అట. ప్రస్తుతం నాగార్జున, నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో "దేవదాస్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.