ప్రముఖ రచయిత వైరముత్తు అలాంటి వాడే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

writer vaira muthhu
Updated:  2018-10-09 05:19:53

ప్రముఖ రచయిత వైరముత్తు అలాంటి వాడే

హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన మీ టూ విప్లవం ఇప్పుడు మన దేశంలో ఊపందుకుంది. లైంగిక వేధింపులకు గురైన ఆడవాళ్లు, సెలెబ్రిటీల తో సహా మీ టూలో భాగంగా వారికి ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో చూస్తే, హీరోయిన్లు, గాయకులు, రచయితలు కూడా తమకు జరిగిన ఘటనలను బయటికి చెబుతున్నారు. ఈ క్రమంలో గాయని చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత వైరముత్తు మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఏడు జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న వైరముత్తు, తన వద్ద పనిచేసిన 18 ఏళ్ల గాయనితో అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయి.

ఆయన వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని, కానీ ఎదురు తిరుగుదామంటే, తనకున్న పరిచయాలతో వాళ్ళ నోళ్లు మూయిస్తాడని ఆ గాయని, జర్నలిస్ట్ సంధ్యామీనన్‌ కి మెసేజ్ చేయగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. వెంటనే సింగర్ చిన్మయి, తన స్నేహితురాలు కూడా వైరముత్తు కారణంగా ఇబ్బంది పడ్డామని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై వైరముత్తు జవాబు ఇవ్వాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.