వ‌ర్మ లైంగిక వేధింపుల‌ను బ‌య‌ట పెట్టిన‌ ర‌చ‌యిత‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-27 01:36:46

వ‌ర్మ లైంగిక వేధింపుల‌ను బ‌య‌ట పెట్టిన‌ ర‌చ‌యిత‌

విల‌క్ష‌ణ‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఏది చేసినా సంచ‌ల‌నంగా మారుతోంది.. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ‌ కొంత కాలంగా సోష‌ల్ మీడియాను వేధిక‌గా చేసుకుని ప‌లువురిపై త‌మ‌ధైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా వ‌ర్మ నిర్మించిన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్... ఈ చిత్రంలో అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాను వ‌ర్మ త‌న కెమెరాతో న‌గ్నంగా చిత్రించారు... ఈ సినిమా నేడువిడుద‌లైన‌ నేప‌థ్యంలో వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్న విజ‌య్ కుమార్ జీఎస్టీ చిత్రం పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌ను చేశారు.

తాను నిర్మించాల‌నుకున్న జీఎస్టీ చిత్రం రామ్ గోపాల్ వ‌ర్మ దొంగిలించాడ‌ని విజ‌య్ కుమార్ ఆరోపించారు... మంచి వ్య‌క్తుల మ‌ధ్య ప‌నిచేస్తే భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ఆశించి గ‌తంలో వ‌ర్మ ద‌గ్గ‌ర ర‌చ‌యిత‌గా ప‌ని చేశాన‌ని విజ‌య్ ఆన్నారు.. వ‌ర్మ‌ ఇలా చేస్తాడ‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని, ఆయ‌నలో కూడా మ‌రోమ‌నిషి ఉన్నాడ‌ని ఎద్దెవా చేశారు.. తాను ఆయనలోని స్వలింగసంపర్క స్వభావాన్ని బయటపెట్టాలనుకోవడం లేదని, కానీ ఆయన లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు

. అయితే రామ్ గోపాల్ వ‌ర్మ‌ ఈ విష‌యంపై స్పందించారు... గ‌తంలో విజ‌య్ కుమార్ త‌న ఆఫీస్ లో చాలా సార్లు దొంగ‌త‌నం చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడ‌ని అన్నారు... జీఎప్టీ సినిమా క‌థ త‌న‌దేన‌ని, తాను ఎవ‌రి ద‌గ్గ‌ర క‌థ‌ను దొంగత‌నం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.