యాత్ర ఫస్ట్‌ లుక్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ysr biopic mammutti
Updated:  2018-04-07 04:11:57

యాత్ర ఫస్ట్‌ లుక్‌

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ పై సినిమా రూపొందుతున్న విష‌యం అంద‌రికి తెలిసిందే... అందులో ప్ర‌ధానంగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  పాద‌యాత్రకు సంబంధించిన మొద‌టి పోస్ట‌ర్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌లు చేసింది. ఈ బ‌యోపిక్‌లో మళయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్ర వ‌హిస్తున్నారు... దీనికి సంబంధించిన టైటిల్‌ లోగోను నిన్న సాయంత్రం విడుద‌ల చేయ‌గా నేడు ఫస్ట్‌ లుక్‌ను వదిలారు. 
 
పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.... అదే దరహాసం అదే తరహా అభివాదం చేస్తున్న మమ్ముట్టి పోస్టర్  ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ బ‌యోపిక్‌ షూటింగ్ త్వ‌ర‌లో మొదలుకానుంది. మహా ప్రస్థానం పేరిట దివంగత ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డిచేపట్టిన పాదయాత్ర నేపథ్యంలోనే యాత్ర చిత్రం ఉండబోతుందన్న సంకేతాలను దర్శకుడు ఇది వరకే ప్ర‌క‌టించేశారు. ఈ చిత్రాన్ని అతి త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేసి విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శకుడు మహి ఉన్నట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.