వైఎస్ బ‌యోపిక్ సినిమాకు టైటిల్ ఇదే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ys rajasekhar reddy
Updated:  2018-03-04 11:53:52

వైఎస్ బ‌యోపిక్ సినిమాకు టైటిల్ ఇదే

గత కొద్ది కాలంగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే.. అయితే ఇప్ప‌టికే దివంగ‌త నేత న‌టుడు నంద‌మూరి తార‌కరామారావు  జీవితక‌థ ఆధారంగా చేసుకుని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా  తెర‌కెక్కించ‌నున్నారు... ఈ సినిమాకు సంబంధించి ల‌క్ష్మిస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది... ఇక మ‌రో ద‌ర్శకుడు తేజ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు ఈ  సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌నున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలోనే దివంగ‌త నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  బ‌యోపిక్  ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే... ఈ సినిమాలో వైఎస్ ప్ర‌ధాన పాత్ర‌లో ముందుగా అక్కినేని నాగార్జున న‌టిస్తారు అనే  వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది... కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం వైఎస్ పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి న‌టింబోతున్న‌ట్లు తెలుస్తోంది... అయితే గ‌తంలో ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించాల‌ని అనుకున్నార‌ట‌, కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌లేక పోయాడు... కానీ ఇప్పుడు ఆయ‌న స్థానాన్ని ద‌ర్శ‌కుడు మ‌హిత్ పూర్తి చేయ‌నున్నారు.
 
ఈ సినిమా క‌థ‌ను ముమ్మ‌ట్టికి ద‌ర్శ‌కుడు వినిపించ‌గా ఆయ‌న ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది... ఈ క‌థ‌లో వైఎస్ రాజ‌కీయ అరంగేట్రం ఎలా జ‌రిగింది, ఆయ‌న మొద‌ట‌గా అసెంబ్లీకి ఏ సెగ్మెంట్  నుంచి ఎంపిక‌య్యారు... ఆ తర్వాత ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఎలా పొందారు అన్న అంశాల‌పై ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కుడు... అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ పాద‌యాత్ర ఎలా జ‌రిగిందో అన్న దానిపై చిత్రించ‌నున్నారు.. అయితే ఈ సినిమాకు సంబంధించి ద‌ర్శ‌కుడు       !!యాత్ర!! అనే టైటిల్ ను ఎంపిక  చేసిన‌ట్లు తెలుస్తోంది... దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలోపు ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.