అమ్మాయిల‌కు చ‌ర్మం పై న‌ల్ల‌మ‌చ్చ‌లు పోవాలంటే ఇలా చేయండి?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-09-14 12:29:04

అమ్మాయిల‌కు చ‌ర్మం పై న‌ల్ల‌మ‌చ్చ‌లు పోవాలంటే ఇలా చేయండి?

యువ‌తీ యువ‌కుల‌కు యుక్త‌వ‌య‌సు వ‌చ్చే స‌రికి  మొటిమ‌లు స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది... అలావే వాటిని చిదిమితే ర‌క్తం కారి అక్క‌డ మ‌చ్చ‌లుగా పుండ్లుగా మారిపోతాయి... ఇవి క‌ణాల వ‌ల్ల ర‌క్తప్ర‌స‌ర‌ణ వ‌ల్ల మ‌రింత గుల్ల‌లుగా మారిపోతాయి.. చివ‌ర‌కు  ఇవి ముఖం పై మ‌చ్చ‌ల్లా ఏర్ప‌డుతాయి ...ఇక ఇలా న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోవ‌డానికి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు చాలా మంది... అయినా అవి వేదిస్తూ ఉంటాయి.. న‌లుగురిలో వెళ్ల‌డానికి ముఖం చూప‌డానికి ఇబ్బందులు ప‌డ‌తారు.. ఇక ఇవి శ‌రీరం పై కూడా న‌ల్ల‌టి రూపంలో మచ్చ‌లుగా ఏర్ప‌డ‌తాయి... ప‌లు కాస్మోటిక్స్ వాడినా  ఆ మ‌చ్చ‌లు శ‌రీరం పై తొల‌గిపోవు, అయితే ఇలాంటి న‌ల్ల మ‌చ్చ‌లు పోవ‌డానికి ప‌లు చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం?
 
ఒక చెంచా తేనె, ఒక గుడ్డు తెల్లసొనను బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల నల్లమచ్చలు, మృతకణాలు తొలిగిపోతాయి..ఇక స‌బ్బు పెట్టి మొఖం పై త‌ర‌చూ రుద్ద‌డం అల‌వాటు చేసుకోవాలి. ముక్కుపై ఏర్ప‌డిన మ‌చ్చ‌లు వెంట‌నే తొల‌గిపోతాయి.
 
అలాగే రెండు చెంచాల నిమ్మరసం, తగినంత దాల్చినచెక్క పొడిని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, భుజాలు, వీపునకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారంలో నాలుగుసార్లు ప్రయత్నించవచ్చు. అలాగే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పొట్ట‌పై ఉన్నా కాళ్ల‌పై ఉన్నా ఇది అప్లై చేసుకోవ‌చ్చు.
 
 అలోవెరా మొక్క నుంచి తాజా జెల్‌ను ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చ‌ల్ల‌ని నీటితో ముఖం శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత తాజాగా ఉంటుంది మీ ఫేస్... అలాగే ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పుదీనా రసంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
తగినన్ని మెంతి ఆకులను పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇక తాజా టమాట గుజ్జును రాత్రి నల్లమచ్చలపై రాయాలి. ఉదయం శుభ్రం చేసుకొంటే తర్వగా పరిష్కారం దొరుకుతుంది.
ఇక న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఉన్న చోట... కొబ్బ‌రిపుచ్చుపై ఉన్న ప‌చ్చ‌టి ప‌దార్దాన్ని మంచి గంధాన్ని స‌మ‌పాళ్ల‌ల్లో తీసుకుని న‌ల్ల మ‌చ్చ‌ల పై రాయ‌డం వ‌ల్ల మ‌చ్చ‌లు తొల‌గిపొతాయి... ఇక బొబ్బాయి ర‌సం రాసి 20 నిమిషాలు ఉంచినా ముఖం పై మ‌చ్చ‌లు తొలిగిపోతాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.