ఈ ఆరు అల‌వాట్లు మీకు ఉంటే క‌చ్చితంగా మార్చుకోండి

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

bad habits
Updated:  2018-07-16 15:09:41

ఈ ఆరు అల‌వాట్లు మీకు ఉంటే క‌చ్చితంగా మార్చుకోండి

మ‌నిషి న‌డ‌క న‌డ‌వ‌డిక బ‌ట్టి అత‌ని ప‌ద్ద‌తిని ఇట్టే చెప్ప‌వ‌చ్చు.. ఇది ఎప్ప‌టి నుంచో మ‌న పెద్ద‌లు కూడా మ‌న‌కు నేర్పే ప‌ద్ద‌తి.... ఈ న‌వీన యుగంలో కొత్త ప‌ద్ద‌తుల‌తో మ‌నిషి యంత్రంలా ముందుకు ప‌రిగెడుతున్నాడు.. అందుకే కొత్త కొత్త అలవాట్ల‌ను కూడా త‌న‌కు తెలియ‌కుండానే నేర్చుకుంటున్నాడు.
 
ఎవ‌రు ఎంత క‌ష్ట‌ప‌డినా గుర్తింపు కోసం ...త‌గిన ఫ‌లితం కోసం చూస్తారు... దాని కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తారు... అయితే ఓ ప‌ద్ద‌తిలో ఆ ప‌నిచేయ‌క‌పోతే దానికి రివ‌ర్స్ ఫ‌లితం వ‌స్తుంది. మ‌నిషి మ‌నిషికి ఆలోచ‌న‌లో కాని బాడీ లాంగ్వేజ్ లో కాని ప‌ద్ద‌తిలో కాని అనేక తేడాలు ఉంటాయి.
 
అయితే జీవితంలో మీరు పైకి రావాలి అనుకుంటే ఈఆరు అల‌వాట్లు క‌నుగ మీకు ఉంటే కాస్త వాటి నుంచి దూరంగా ఉంటే మంచిది అయితే ఈ అలావాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం
 
1. సైగ‌లు చేసే ప‌ద్ద‌తి
 
అవును మ‌నం మాట్లాడ‌టం త‌గ్గించి కొన్ని విష‌యాల‌లో సైగ‌లు చేస్తాం.. ఇవి ఎవ‌రికైనా అర్ద‌వంతంగా ఉండేలా చేయాలి, లేక‌పోతే క‌చ్చితంగా ఆ సైగ‌ల‌ను మానుకోవాలి. అన్నింటికి కూడా సైగ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు... ఈ సైగ‌ల ప‌ద్ద‌తి మీ  విజ‌యానికి ఆటంక‌మే
 
2. కూర్చొనే విధానం
 
మనం పెద్ద‌వారి ముందు కూర్చొనే విధానం చిన్న‌త‌నం నుంచి నేర్చుకుంటాం... కాలు మీద కాలు వేసుకోకుండా నిటారుగా వారి ముందు కూర్చుంటాం.. అలా ఉంటే పెద్ద అయిన త‌ర్వాత, ఉద్యోగాలు వ్యాపారాలలో కూడా గ‌ర్వం లేకుండా ఆశీనుల‌వుతాం.. అది మ‌న‌ల్ని జీవితంలో ఎంతో పైకి తీసుకువ‌స్తుంది.. మ‌న‌ల్ని కొత్త వ్య‌క్తులు చూడ‌గానే మ‌న‌పై వారికి బెస్ట్ ఇంప్ర‌షెన్ ప‌డుతుంది.
 
3..వ‌స్త్ర‌దార‌ణ‌...
 
ప‌రుగులు పెడుతున్న ఈ యుగంలో  లైఫ్ స్టైల్ లో విభిన్న మార్పులు వ‌చ్చాయి.. యువ‌త మ‌రింత త‌మ వ‌స్త్ర‌దార‌ణను కూడా మార్చుకుంది.. అయితే ఉద్యోగం - వ్యాపారం అయినా మ‌న వ‌స్త్ర‌దార‌ణ మ‌న‌ల్ని ఇత‌రుల‌కు ఓ అభిప్రాయాన్ని క‌లిగేలా చేస్తుంది. అందుకే మ‌న‌కంటే పెద్ద‌వారి ముందు ఉన్న‌తాధికారుల ముందు చేతి క‌ప్స్ మ‌డ‌త‌పెట్టుకోకుండా ఇప్ప‌టికి ఉంటున్నారు అది మ‌న ఎదుగుద‌ల‌కు ఎంతో ముఖ్యం.
 
4. జుట్టు
అన‌వ‌స‌రంగా జుట్టును ఒత్త‌డం మానుకోవాలి, పెద్ద‌వారు ఉన్న‌తాధికారులు మాట్లాడుతున్న స‌మయంలో జ‌ట్టుపై చెయ్యి వేశారు అంటే, మీకు  అవ‌త‌ల వ్య‌క్తి చెప్పే దానిపై వినాలి అనే ఆస‌క్తి లేదు అనేది, అవ‌త‌ల వ్య‌క్తికి సూచ‌న‌గా తెలుస్తుంది... అందుకే ఎవ‌రితో మాట్లాడినా స‌రే జుట్టుపై చేయి వేయ‌కూడ‌దు.
 
5.. న‌వ్వు 
 
న‌వ్వు నాలుగువిధాలుగా చేటు అంటారు.. అయితే అసంద‌ర్బంగా న‌వ్వ‌కుండా సంద‌ర్బంగా న‌వ్వితే ఆన‌వ్వుకి ఓ అర్ధం. అందుకే అన్ని చోట్లా కాకుండా అవ‌స‌రమైన చోట మాత్ర‌మే న‌వ్వుని బ‌య‌ట‌వ్య‌క్తుల‌కు ఎక్స‌ప్రెస్ చేయాలి.
 
6...హ్యాండ్స్ 
 
ఇత‌రుల‌ను క‌లిసిన స‌మ‌యంలో షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం మ‌న‌కు అలవాటు... ఆ స‌మ‌యంలో హ్యాండ్ ను హార్డ్ గా ప‌ట్టుకోరాదు.. అలాగే ఇత‌రుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో హ్యాండ్స్ షేక్ అవ‌కుండా చూసుకోవాలి.
 
ఇలాంటి ప‌ద్ద‌తులు మీరు పాటిస్తే జీవితంలో మీరు అనుకున్న హైట్స్ కి సుల‌భంగా చేరుకోవ‌చ్చు.
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.