అల్లంతో ఆరోగ్యం పదిలం

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-20 10:34:53

అల్లంతో ఆరోగ్యం పదిలం

అల్లం రోజూ తీసుకోటం ఆరోగ్యానికి అవసరం. ఇందులో విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి పోషక విలువలు ఉన్నాయి. పసి పిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండటం ఆనవాయితీ. నాటు వైద్యంలో అల్లంకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అల్లం అండాశయ మరియు పెద్ద ప్రేగు కాన్సర్ బారిన పడకుండా చేస్తుంది.

షుగర్ నియంత్రించటంలో మంచి ఔషధం అంటున్నారు నిపుణులు.

జలుబు, దగ్గు, కఫం వంటి వాటికి అనాదిగా అల్లం వాడుతూ వస్తున్నారు. 

ఉబ్బసం వ్యాధితో బాధ పడేవారు అల్లం రసం లో తేనె కలుపుకుని తాగితే ఉబ్బసం తగ్గి ఆకలి కూడా బాగా వేస్తుంది. జీర్ణక్రియ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది. 

దగ్గు ఎక్కువగా ఉన్నట్టయితే అల్లం ముక్క ఎండబెట్టి చేసిన పొడికి కొంచెం జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.

అల్లం వాడితే గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అరకప్పు వేడి నీళ్లలో చెంచా శొంఠి పొడి, అల్లం రసం, అర చెంచా నిమ్మ రసం, తేనె కలిపి పుక్కిలిస్తే గొంతు మంట, నొప్పి అదుపులోకి వస్తాయి. 

అల్లం మంచి యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్ధికి తోడ్పడి, రక్త నాళాలలో రక్తం గడ్డకట్టకుండా అరికడుతుంది.

అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కడుపులో పూత ఏర్పడదు.

అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది, నోటిలో చేరిన ప్రమాదకర బాక్టీరియా ను సంహరించి దంతాలను ఆరోగ్యవంతం గా మారుస్తుంది.

బాలింతలకు శరీరం గట్టి పడేందుకు, వేడిని కలిగించేందుకు అల్లం ఎక్కువగా వాడతారు.

ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మజ్జిగలో అల్లం, కరివేపాకు కలిపి తీసుకుంటే మంచిది.

చాలామందికి ప్రయాణాలు సరిపడవు.. వికారం, వాంతులతో బాధ పడతారు. ప్రయాణం చేస్తున్నపుడు అల్లం ముక్కను చప్పరిస్తూ ఉంటే అలాంటివి ఉండవు.

గర్భిణీ స్త్రీలకు తల తిరగటం, వికారం, వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అల్లం తినటం వలన చాలా వరకు ఉపశాంతి ఉంటుంది.

చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరికైనా కడుపులో మంట, నొప్పి, ఆకలి లేనప్పుడు అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.