ఆరోగ్యానికి పాలు చేసే మేలు

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-20 10:29:17

ఆరోగ్యానికి పాలు చేసే మేలు

ఆరోగ్యానికి పాలు చేసే మేలు అంతో ఇంతో కాదు చాలానే ఉంది. ఇందులో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. చాలామంది పాలు వాసన కూడా పడదు అంటారు కానీ మంచి ఆరోగ్యానికిపాలు స్వీకరించటం ఎంతో శ్రేయస్కరం.

1.     పాలలో కాల్షియమ్, ఫాస్పరస్, విటమిన్-D పుష్కలం.

2.     పాలను మన నిత్య ఆహారంలో చేర్చుకోవటం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

3.     పాలలో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది.

4.     గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే జలుబు, జ్వరం తగ్గుతాయి. ఈ పాలను తాగడం వలన శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి.

5.     ఇలా తాగటం వలన తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ పాలు యాంటివైరల్ గా కూడా పని చేస్తాయి. 

6.     పసుపు పాలను తాగటం వలన కండరాల నొప్పులు, కాళ్ళ వాపులు కూడా తగ్గుతాయి.

7.     రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పులు, కడుపు నొప్పి కూడా ఉండవు.

8.     కొవ్వు లేని పాలు సేవించటం వలన టైప్-2 మధుమేహం బారిన పడే అవకాశాలు తక్కువ.

9.     పాలలో ఉండే కాల్షియమ్, మెగ్నీషియం రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ ను ఆరురోగ్యకర స్థాయిలో ఉంచుతాయి.

10.  చర్మ సౌందర్యానికి పాలు ఎంతో ఉపయోగపడతాయి. అవి లోపలికి తీసుకున్నా, బాహ్య లేపనాలలో వాడినా వాటి ఫలితం ఉంటుంది.

11.  పాలు సహజ క్లెన్స‌ర్.. పాలలో దూది ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం పైన మురికి తొలగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

12.  పాలు, పసుపు కలిపి ముఖానికి లేపనం వేసిన ముఖం మంచి ఛాయను పొందుతుంది.

13.  రాత్రి పడుకునే ముందు పాలను తాగితే సుఖ నిద్ర పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.

14.  పాలు పురీష నాళ, రొమ్ము కాన్సర్ లను తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

15.  కొంచెం కష్టం అయినా ఇష్టం చేసుకుని పాలను రోజు తాగుతుంటే ఆరోగ్యం మన సొంతం.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.