అందం, ఆరోగ్యం రెండు బాదాంతో సాధ్యం

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-20 10:45:40

అందం, ఆరోగ్యం రెండు బాదాంతో సాధ్యం

ఈ సూపర్ నట్స్ లో చాలా సుగుణాలున్నాయి.. తల్లి పాలలోని ప్రోటీన్లు వీటిలో దొరుకుతాయి.. గుండెపోటును అరికట్టడంలోనూ, గుండె వ్యాధులను నివారించటంలోనూ ఇవి శక్తివంతమైనవి.. రోజు బాదాం గింజలు తింటే మనలో వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది.

రోజు పావు కప్పు బాదంపప్పు తింటే ఆరోజుకు అవసరం ఐన విటమిన్ 'ఇ' సగం లభించినట్టే... ఇందులోని 'బి' విటమిన్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.

బాదంలో శాచురేటెడ్ కొవ్వు శాతం తక్కువ కావటంతో ఇవి బరువును కూడా తగ్గిస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ ను సమ స్థాయిలో ఉంచుతుంది.

బాదంలో ప్రోటీన్లు, అత్యధిక న్యూట్రిషన్ గుణాలు ఉండటం వలన ఇవి తీసుకుంటే వేరే పోషక పదార్ధాలు, మెడిసిన్లు వాడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.

వీటిలో హానికర అంశాలు కూడా లేవు అందువల్ల వీటిని చిన్నపిల్లల రెగ్యులర్ డైట్ లో వాడితే మంచిదే.

వారంలో ఐదు రోజులు రోజూ పది బాదంపప్పులు తింటే గుండె సమస్యలు నియంత్రణలో ఉంటాయి. 

కొలెస్ట్రాల్ నియంత్రించటానికి ప్రతి రోజూ ఉదయం రెండు లేదా మూడు బాదంపప్పులు తినాలి.

ఆస్టియోపొరోసిస్ అదుపు చేయటంలో బాదంలో లభించే ఎంతో సహాయపడుతుంది.. ఎముకలను పటిష్టం చేస్తుంది. శరీర అవయవాలకు, కణాలకు ఆక్సిజన్ ను చేరవేస్తుంది.

అలసటగా ఉన్నప్పుడు నాలుగు బాదంపప్పులు తింటే వెంటనే శక్తి లభిస్తుంది. 

షుగర్ తో బాధపడేవారు భోజనం తర్వాత తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది.

మెదడు చురుకుగా పని చేయటానికి రోజూ రెండు లేదా మూడు బాదంపప్పులు రాత్రి నానబెట్టి తర్వాత రోజూ ఉదయాన్నే తింటే సరి.

పెద్ద ప్రేగు కాన్సర్ నియంత్రణలోనూ బాదం చురుకుగా పని చేస్తుంది.

జుట్టు రాలడాన్ని కూడా అధిగమిస్తుంది. వారానికి ఒకసారి అయినా బాదం నూనె తలకు రాయటం వలన జుట్టు తేమని సంతరించుకుని పొడి బారకుండా ఉంటాయి. జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. బాదం తినటం వలన కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మ సౌందర్య సాధనాలలో కూడా బాదం ను విరివిగా వాడుతున్నారు. చర్మం కాంతిని సంతరించుకోవాలంటే రాత్రి పాలలో నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి నీతితో శుభ్రం చేసుకోవాలి.

బాదం పప్పు వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసుకున్నాం కదా!! ఇన్ని ప్రయోజనాలున్న బాదంను మన ఆహారంలో భాగం చేసుకుందామా మరి..

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.