పెరుగుతో తరగదు అందం ఆరోగ్యం

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

Updated:  2018-01-20 10:48:47

పెరుగుతో తరగదు అందం ఆరోగ్యం

చాలామంది పెరుగును ఇష్టపడరు. కానీ కొంచెం కష్టం అయినా ఇష్టం చేసుకుని తింటే పెరుగు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు.

 

 

ప్రతి రోజూ పెరుగు తీసుకుంటే అది దివ్య ఔషధంలా పని చేస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్లను మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.

 

మనం తీసుకున్న తర్వాత పెరుగు ఒక గంటలో 91%  జీర్ణం ఐతే అదే సమయంలో పాలు 32% మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 

 

జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉన్నవారికి పెరుగు అమృతంలాంటిది. ముఖ్యంగా పిల్లలు, వయసు పైబడిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పని చేస్తుంది. 

 

పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్దకం తగ్గుతుంది. వేసవి కాలంలో పెరుగు మజ్జిగలా చేసుకుని పంచదార కలిపి సేవిస్తే వేసవి వేడి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

 

పెరుగులో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ పెరుగు సేవించటం వలన ఉదర సంబంధిత వ్యాధులు మటుమాయం అవుతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు పెరుగు మంచి ఔషధం.

 

అల్సర్ తో బాధపడేవారికి పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరు పుండు ఐతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తే ఉపశమనం కలిగిస్తుంది అంటున్నారు వైద్యులు.

 

చర్మకాంతికి కూడా పెరుగు దోహద పడుతుంది. 

 

పెరుగులో నిమ్మరసం చేర్చి ముఖానికి పైపూతలా వేస్తే మలినాలు తొలగి తేమశాతం పెరుగుతుంది.

 

ముఖంపై మొటిమలు ఉన్నవారు పెరుగులో శనగపిండి కలిపి రాస్తూ ఉంటె మొటిమలు తగ్గు ముఖం పడతాయి. 

 

జుట్టుకి కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది.

 

తల స్నానానికి ముందు పెరుగుతో తల అంతా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి కండీషనింగ్ అవుతుంది.

 

చుండ్రు సమస్య ఉన్నవారు పెరుగులో ఉసిరి పొడిని కలిపి అరగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

పెరుగు ప్రతిరోజూ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.