తుమ్మును బలవంతంగా అవుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

sneezing
Updated:  2018-07-21 03:12:05

తుమ్మును బలవంతంగా అవుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

మీకు తుమ్ము వస్తున్నపుడు బలవంతంగా అవుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే...ఎందుకో తెలుసా?  గంటకు వంద మైళ్లు వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తుమ్ము వల్ల చాలా శక్తివంతమైన గాలి శరీరం నుంచి ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే.. అది శరీరంలోని అంతర్గత భాగాలపై ప్రతి చర్య చూపెడుతుంది. తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.
 
లండన్‌లోని 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపేందుకు ముక్కు రంధ్రాలు నోరు ఒకేసారి మూశాడు. అతడి గొంతు మధ్య అంతర్గతంగా రంధ్రమైంది. ఆ తర్వాత అతని గొంతు మారిపోయింది. గొంతు బాగా వాచి నొప్పి వస్తుండంతో బాధితుడు వైద్యులను కలిసాడు.
 
సీటీ స్కాన్‌లో అతని గొంతు లోపలి భాగం చిధ్రమైనట్లు గుర్తించారు. గాలి బుడగలు గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయి. దీనివల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి వెంటనే అతనికి చికిత్స అందించారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అతను కోలుకున్నాడు.
 
తుమ్మును బలవంతంగా ఆపితే మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్‌ ఆఫ్‌ లీచెస్టర్‌కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా తుమ్ము వస్తే బలవంతంగా ఆపే ప్రయత్నం చేయొద్దు. ముక్కు, నోటిని బలంగా మూసే ప్రయత్నం చేయొద్దు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.