యోగ చరిత్ర దశల వారీగా...

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

yoga
Updated:  2018-06-14 12:56:05

యోగ చరిత్ర దశల వారీగా...

ప్రపంచానికి యోగాను, ఆధ్యాత్మిక‌త‌ను ప‌రిచయం చేసింది మ‌న భార‌త దేశం.  అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ద్వారా ఎన్నో ప్ర‌పంచ దేశాలు. భార‌త దేశంవైపు తొంగి చూస్తున్నాయి.అత్యంత అద్బుత‌మైన‌ది, శ‌క్తివంత‌మైన‌ది యోగ. ప్ర‌తీరోజు యోగా చేయ‌డం వ‌ల్ల మ‌నిషిలో ఉన్న నీరసం , అల‌స‌ట‌, అధిక ఒత్తిడి, మాన‌సిక ప్ర‌శాంతత‌ అన్ని చేకూరుతాయి.
 
యోగా ఇప్పుడు పుట్టింది కాదు..అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న ఒక అద్భుతం యోగ. మొహంజదారో నాగరితక నాటి నుంచి నేటి వరకు యోగాయానం దశలవారీగా అభివృద్ధి చెందుతుంది 
 
క్రీ.పూ. 7000-1300 : 
 
మొహంజదారో కాలంలో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. ఈ నాణేలపైనా మోకాళ్లు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. దీనిని బట్టి మొహంజదారో కాలంలోనే యోగ ఉందని చెప్పవచ్చు...
 
క్రీ.పూ 1700 - 1000 :
 
రుగ్వేదంలో దైవశక్తిగా భావించే హిరణ్యగర్భుడు యోగతత్వాన్ని సృష్టించాడని కొందరి భావన.. ఆ సమయంలో యోగాను యుద్ధరథంగా కూడా భావిస్తారు..
 
క్రీ.పూ 1200-1400 :
 
కృష్ణుడు భగవద్గీతలో పరమాత్మకు సంబందించిన విషయాల గురించి ప్రస్తావించేటప్పుడు ఒక వంద సార్లైనా యోగ అనే పదాన్ని సంబోదించాడని పురాణాలూ చెప్తున్నాయి...
 
క్రీ.పూ 900-500 :
 
మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను, పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్థావించాయి.
 
క్రీ. శ. 200-400 :
 
అన్ని హాసనాలను ఒక చోట చేర్చి యోగాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు పతంజలి...అష్టాంగ యోగలో పతంజలి ఎనిమిది విధానాలాగా చెబుతుంది...
 
క్రీ.శ. 600 :
 
మంత్రాన్ని, యోగాసనాలను, ప్రాణాయామాన్నీ కలిపి ఒక తంత్రాన్ని తయారుచేసారు...ఆ తంత్రాన్ని మహిళా దేవతల్ని, మానవ లైంగిక త్వాన్నీ పూజించేందుకు ఉపయోగించేవారు...ఈ క్రియలతో దేహం దేవాలయంగా మారుతుందనేది ఒక భావన.
 
క్రీ.పూ.700 :
 
బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా ప్రసిద్ధులైన యజ్ఞవల్క్యుడు అష్టాంగయోగ గురించి విపులీకరిస్తాడు. తన భార్య గార్గీకి తనకూ మధ్య జరిగిన సంభాషణల రూపంలో ఈ వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఉపసంహారం, ఇమిడిపోవడం, జాగృతి, శ్వాస వంటి నైపుణ్యాల ఆధారంగా చెబుతాడు.
 
క్రీ.పూ. 600 :
 
తొలి బౌద్ధ గ్రంథాల్లో యోగ అనే మాట ఎక్కడా లేదు. కానీ ధ్యానం, ప్రాణాయామం, మంత్రం వంటి అంశాలపై చర్చ జరిగింది. బుద్ధుని దృష్టిలో యోగ ఒక సాధన, ఇది పరిపూర్ణ మేధస్సుకు మార్గం...
 
క్రీ.శ. 1200 - 1700 :
 
హైందవ సాధువు గోరక్‌నాథ్‌ తంత్రానికి సంబంధించిన రెండు గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ఒకటి 15వ శతాబ్దంలో వచ్చిన ‘హఠయోగ ప్రదీపిక’, రెండవది 17వ శతాబ్డంలో వచ్చిన ‘ఘేరంద సంహిత’. ఈ రెండూ గురు శిష్య సంవిధానాన్ని చెబుతాయి.
 
1849 :
 
యోగా తత్వం మీద కోల్‌కతా రచయితలైన డాక్టర్‌ ఎన్‌.సి.పాల్‌ రాసిన గ్రంథం, యోగా మీద వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనంగా గుర్తింపు పొందింది.
 
1893 :
 
పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేసిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద...అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగ గురించి పెద్ద ప్రసంగం ఇచ్చారు...
 
1920 :
 
పరమహంస యోగానంద క్రియా యోగ మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో స్వీయ జ్ఞానోదయం అనే వ్యవస్థను కూడా స్థాపించారు.
 
1936 :
 
స్వామి విష్ణుదేవానంద హఠయోగలోని శివానంద యోగాను బాగా ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో 12 ఆసనాలు ఉంటాయి. వీటి లక్ష్యం వెన్నెముకలో మృదుత్వాన్ని పెంచడమే. 
 
1950- 1970 :
 
మహర్షి మహేశ్‌ యోగి ఆయన నెలకొల్పిన అతీత ధ్యానం ఎన్నో అద్భుత ఫలితాలనిచ్చింది. ఈయన వివేకానంద జ్ఞానమార్గాన్ని, హరేకృష్ణ మహా మంత్రాన్ని, భగవద్గీత అంశాల్ని కూడా యోగాలో భాగం చేశారు.
 
1973 :
 
యోగా గురువు బిక్రం చౌదరి తన తొలి యోగా కాలేజ్‌ను అమెరికాలో స్థాపించారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన గదిలో వేసే 26 ఆసనాలు ఆయన సొంతంగా రూపొందించినవి. ‘హాట్‌ యోగా’ గా పిలవబడే ఈ యోగా శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపించడంతో పాటు, శరీర బరువును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది..
 
1990 :
 
డాక్టర్‌ డీన్‌ ఆర్నిష్‌ అనే వ్యక్తి తన పరిశోధనల ద్వారా కొన్ని రకాల ఔషధాలకు యోగాను కూడా జోడిస్తే.. గుండె జబ్బులను, టైప్‌- 2 మధుమేహాన్ని తగ్గించవచ్చని రుజువు చేశాడు. 
 
2000 :
 
అమెరికాకు చెందిన వెల్‌నెస్‌ టీచర్‌ డాక్టర్‌ ఆండ్రివ్‌ వెల్‌ అనే ఒక వైద్యుడు, ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చని పేర్కొన్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.