దుమ్ము దులుపుతున్న సెలబ్రిటీలు

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

yoga
Updated:  2018-06-14 12:24:09

దుమ్ము దులుపుతున్న సెలబ్రిటీలు

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం తో అందరిలో యోగా పై ఆసక్తిని చూపుతున్నారు...ఇదే మార్పు ఇపుడు సెలబ్రిటీల్లో  కూడా బాగా కనిపిస్తోంది...ఇక వీరిని చూసి ఫ్యాన్స్ కూడా యోగా ను స్టార్ట్ చేస్తున్నారు....ఇది మన దేశం కాస్త తక్కువే కాని విదేశాలలో దీని ప్రభావం ఎక్కువాగానే ఉంది.... ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో 186 దేశాల్లో యోగా ఆచ‌రిస్తున్నార‌ని తాజాగా యునెస్కో వివరించింది..ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మంచి న‌డ‌వ‌డిక‌ను అందించే యోగపై ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు మక్కువ  పెంచుకుంటున్నారు.
 
విదేశాల్లోని ప్ర‌తి వంద మంది సెల‌బ్రిటీల‌లో 80 మంది మేం యాగా చేస్తున్నామ‌ని చెప్పుకొస్తున్నారు.... ఇక హాలీవుడ్‌ నటులు, ప్రముఖ పాప్‌ సింగర్స్  కూడా యోగ చేస్తున్నారు. బాలివుడ్ ఒకప్పటి నటి రేఖ నుండి  ఇప్పటి  సోనాక్షి వరకూ యోగ చేస్తున్నారు, అలాగే హాలీవుడ్‌ తారలు మెగ్‌రెయాన్‌, జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ వంటి తారలు అక్కడి యువతకు యోగ ఐకాన్లుగా మారారు. ప్రముఖ గాయకుడు రిక్కీ మార్టిన్‌, సింగర్ మడోన్నా కూడా యోగా చేస్తోంది....
 
వీరంతా  తాము డైలీ  యోగానుచేయటం  వల్లే ఎంతో  సక్సెస్  సాధించగలిగామని చెప్పడం విశేషం. తాను యోగా చేయడం ప్రారంభించి ఐదేళ్ళు అయిందని, అది తను మరింత ప్రశాంతంగా ఉండటానికి హెల్ప్ చేసిందని అలాగే అది తన జీవితాన్నే మార్చి వేసిం దని మెగ్‌రెయాన్‌ వంటి యాక్టర్  పెద్ద విశేషమే. తాను యోగ నేర్చుకుంటున్నానని, ఇది మన గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో హెల్ప్ చేస్తుందని లాటిన్‌ పాప్‌ సింగర్  రిక్కీ మార్టిన్‌ అంటున్నాడు.
 
ఇక మన భారత్ లో శిల్పా శెట్టి, అనుష్క వంటి హీరోయిన్స్ యోగ చేసి తమ అందచందాలతో టాలివుడ్ లో ఎలా దూసుకుపోతున్నారో తెలిసిందే. యోగ వల్ల అనేక లాభాలు ఉన్నాయంటూ  క్రమం తప్పకుండా యోగా సాధన  చేస్తున్న సెలబ్రిటీ లిస్ట్ లో మంచు లక్ష్మి కూడా  చేరింది. అలాగే సింగర్ కం నటి స్మిత కూడా తాను చేసిన యోగా అభ్యాసాలను యోగా భంగిమలను గతం లో సోషల్ మీడియా లో అప్లోడ్ కూడా చేసింది...యోగాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడంలో ప్ర‌ముఖ యోగ గురువు రాం దేవ్ బాబా అలాగే  ర‌వి శంక‌ర్గురువు ఎంతో కృషి చేస్తున్నారు.. యువ‌త‌పై యోగా ప‌ట్ల మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు బాలీవుడ్ యాక్టర్ శిల్పా శెట్టి  ఏకంగా యోగా టీచర్ గా మారి క్లాసెస్ తీసుకుంటోంది.. 
 
వీళ్ళే కాదు ఎంతోమంది హీరోయిన్స్  ఫిట్ గా ఉండేందుకు, అందంగా ఉండేందుకు, అందాన్ని కాపాడుకునేందుకు....యోగా మీదే ఆధారపడుతున్నారు... సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా మన యోగా....ఇంకేండుకండీ ఆలస్యం మీరూ యోగాను ప్రారంబించండి...అధ్భుతమైన ఫలితాలు మీసొంతం చేసుకోండి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.