కన్నీటితోనూ కరెంట్ ..? వింటానికే విచిత్రం..

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

current
Updated:  2018-07-19 06:12:32

కన్నీటితోనూ కరెంట్ ..? వింటానికే విచిత్రం..

జలవిద్యుత్ గురించి విన్నాం కానీ.. కన్నీటితో కరెంట్ తయారీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కాస్త వింతగా ఉన్నా ఇది నిజమే. కన్నీటితోనూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని .. గుడ్డు తెల్లసొన, కన్నీరు, లాలాజలం, క్షీరదాల పాలు.. ఇలా కరెంట్ తయారీకి కాదేదీ అనర్హంఅది ఎలాఅంటే అంటున్నారు పరిశోధకులు. వీటిల్లో ఉండే ఓ ప్రొటీన్‌తో కరెంట్ ఉత్పత్తి చేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ లిమెరిక్ శాస్త్రవేత్తలు తెలిపారు.
 
ఎలా  అంటే  ...పీడనాన్ని పెంచడం ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయవచ్చు. దీన్నే పిజోఎలక్ట్రిసిటీ అంటారు. క్వార్ట్‌జ్ లాంటి పదార్థాలు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా.. ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి పదార్థాలను రెజోనేటర్లు, ఫోన్లలో వైబ్రేటర్ల తయారీకి ఉపయోగిస్తారు.
 
ఈ ..పిజోఎలక్ట్రిసిటీని లైసోజోమ్ లాంటి ప్రోటీన్ల నుంచి ఉత్పత్తి చేయొచ్చని కనుక్కోవడం ఇదే తొలిసారి. ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఫిజోఎలక్ట్రిసిటీతో పోలిస్తే.. జీవసంబంధ పదార్థాల నుంచి ఉత్పత్తయ్యే ఫిజోఎలక్ట్రిసిటీ ఏ మాత్రం విషము  కాదు. దీన్ని ఎలక్ట్రోయాక్టివ్, వైద్య పరికరాల్లో సూక్ష్మజీవులను నశింపజేసే పూతగా వాడొచ్చు.ఈ  లైసోజోమ్ స్ఫటికాలను సహజ వనరుల నుంచి తేలిగ్గా రూపొందించొచ్చు. దీని సాయంతో భవిష్యత్తులో శరీరంలో మందుల విడుదలను నియంత్రించే ఆవిష్కరణలు సులభతరం అవుతాయి.  నా..  లెడ్జీ  పెరిగేకొద్దీ  ఎన్నో  కొత్త  ఆలోచన్లు  పుట్టుకు వస్తూ  ఉంటాయి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.