కడుపులోని బిడ్డ ఆడ లేదా మగగా ఎప్పుడు మారతారో తెలుసా?

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

baby
Updated:  2018-07-21 15:16:10

కడుపులోని బిడ్డ ఆడ లేదా మగగా ఎప్పుడు మారతారో తెలుసా?

సైన్స్ ప్రకారం మానవ శరీరంలో XX – XY అనే రకం క్రోమోజోముల ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ శరీరంలోని కారియోటైప్ లో మొత్తం 23 క్రోమోజోములు ఉంటాయి. వీటిలో దైహిక క్రోమోజోములు 22 అని, ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు. కానీ పురుష, మహిళల శరీరంలో దైహిక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి. ఐతే లైంగిక క్రోమోజోములు మాత్రం విభిన్నంగా ఉంటాయి.
 
ఎలా అంటే మగవారిలో X, Yక్రోమోజోములుగా, మహిళల్లో X,X క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం X క్రోమోజోములుగా, మిగతా సగం Y క్రోమోజోములు, కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం (X) అండకణాలను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు X శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడ పిల్లగా, అండకణాలు Y శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ బిడ్డగా మారుతారు. పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా అనేది శుక్రకణాలపై ఆధారపడి ఉంది.
 
లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుస్తుంది?
 
సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడ బిడ్డ అనేది 19 లేదా 20 వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ ఆరవ వారం నుండి ఎదుగుదల, అవయవాల్లో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. 9 వ వారంలో మగ, ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20 వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడతాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.