ఈ ఆరు అల‌వాట్లు మీకు ఉంటే క‌చ్చితంగా మార్చుకోండి...

Breaking News

హోమ్        ఆరోగ్యం      న్యూస్

habits
Updated:  2018-06-14 11:39:55

ఈ ఆరు అల‌వాట్లు మీకు ఉంటే క‌చ్చితంగా మార్చుకోండి...

పూర్వం మన నడవడికను బట్టి మన వ్యక్తిత్వాన్ని చెప్పేవారు...అందుకే మన పెద్దలు ఎలా మెలగాలో నేర్పించేవారు...కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి యంత్రంలా పరిగెడుతూ కొత్త కొత్త అలవాట్లను నేర్చుకుంటూ మన సంప్రదాయాలను మర్చిపోతున్నారు...అందుకే జీవితంలో మన ఉన్నతస్థాయికి ఎదగాలంటే ఆరు అల‌వాట్లకు దూరంగా మనం కొంత వరకు పైకి ఎదగవచ్చు...ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం...
 
1. సైగ‌లు చేసే ప‌ద్ద‌తి..
మనం కొన్ని విషయాలను మాటలతో కాకుండా సైగలతో చెప్పాలని చూస్తాం...మనం చేసే సైగలు ఎదుటి వారికీ అర్థం అయ్యే విధంగా ఉండాలి..లేకపోతె సైగలు చేయకుండా మాటలతో చెప్పాలి...అందుకే సైగలు చేసే పద్దతిని మానుకోవాలి లేకపోతె ఇది మన విజయానికి అడ్డుపడుతుంది...
 
2. కూర్చొనే విధానం
మనం పెద్దవారి ముందు కూర్చునే విధానం మనల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుంది...ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మనం కూర్చునే విధానం సక్రమంగా ఉంటె ఎదుటివారికి మనపైనే మంచి ఒపీనియన్ కలుగుతుంది..ఇది మనం ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది...
 
3..వ‌స్త్ర‌దార‌ణ‌...
పరుగులు పెడుతున్న ఈ నవీన యుగంలో కాలానికి అనుగుణంగా మన వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి...ఈ నవీన యుగంలో మన వస్త్రధారణ ఇతరులకు మనపైన ఒక అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది...అందుకే ఉన్నతాధికారుల ముందు మన వస్త్రధారణ చాల ఇంపార్టెంట్...అది కూడా మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది...
 
4. జుట్టు
పెద్దవారు, ఉన్నతాధికారులు ముందు మాట్లాడేటప్పుడు మన చేతిని జుట్టు పైన పెట్టుకోవడం, జుట్టును నులుముకోవడం వంటివి చేయకూడదు...మనం ఆలా చేయడం వల్ల మనకు ఆసక్తి లేదని ఎదుటివారు అనుకునే అవకాశం ఉంది...
 
5.. న‌వ్వు 
నవ్వించడం ఒక భోగం...నవ్వడం ఒక యోగం..నవ్వకపోవడం ఒక రోగం అంటారు...నవ్వు వల్ల మంకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే న‌వ్వు నాలుగువిధాలుగా చేటు అంటారు...అందుకే నవ్వు అనేది సందర్భానికి అనుగుణంగా ఉండాలి తప్ప...ప్రతి సందర్భానికి నవ్వకూడదు...
 
6...హ్యాండ్స్ 
మనం ఎవరినైనా కలిసినప్పుడు మనకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం అలవాటు...షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి...హ్యాండ్ షేక్ అవ్వకుండా చూసుకోవడం...హ్యాండ్ ని గట్టిగా పట్టుకోవడం లాంటివి చేయకూడదు...
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.